మండలంలోని చండ్రాయనిపల్లికి చెందిన ఓ మానసిక వికలాంగురాలికి విదేశీయులు చేయూతనిందించారు.
చండ్రాయనిపల్లి(బుక్కపట్నం): మండలంలోని చండ్రాయనిపల్లికి చెందిన ఓ మానసిక వికలాంగురాలికి విదేశీయులు చేయూతనిందించారు. గ్రామానికి చెందిన రామాంజనమ్మ పుట్టుకతోనే వికలాంగురాలు. ఈమెకు తల్లి లేదు. తండ్రి ఉన్నారు. పుట్టపర్తి మండలం చెర్లోపల్లి ప్రాథమికోన్నత పాఠశాల హెచ్‌ఎం చెన్నకృష్ణారెడ్డి పక్కనే ఉన్న తరుగువాండ్లపల్లికి చెందిన వ్యక్తి కావటంతో విషయం తెలుసుకొని తన వంతుగా చేయూతనిందిస్తూ గ్రీసు దేశానికి చెందిన సత్యసాయి భక్తుడు డిబిలీయస్ సహకారంతో సుమారు లక్ష రూపాయలతో షెడ్డు నిర్మాణం పనులు చేపట్టారు. ఇందులో రూ.10 వేలు చెన్నకృష్ణారెడ్డి వాటాగా విరాళం అందించారు. ఆదివారం గ్రీసు దేశస్తుడు గ్రామానికి వచ్చారు. ఆయనకు ప్రధానోపాధ్యాయుడు, గ్రామస్తులు ఘనంగా స్వాగతం పలికారు. విదేశీయులు చేయూతనిందించేందుకు కృషి చేసిన చెన్నకృష్ణారెడ్డికి రామాం జనమ్మ తండ్రి,గ్రామస్తులు కృతజ్ఞతలు తెలిపారు.