contribute
-
కెనడా కాలేజీలు, వర్సిటీలకు భారత విద్యార్థుల అవసరమే ఎక్కువ!
ఒట్టావా: ఖలిస్తానీ తీవ్రవాది హర్దిప్ సింగ్ నిజ్జర్ హత్యతో కెనడా, భారత దేశాల మధ్య సంబంధాలు ఇటీవల అనూహ్య మార్గంలో పయనిస్తున్నాయి. కెనడా ఉన్నత విద్యాసంస్థల్లో భారతదేశం నుంచి పెద్ద సంఖ్యలో విద్యార్థులు చదువుతున్న కారణంగా కెనడాలోని ఖలిస్తానీ తీవ్రవాదుల భారత వ్యతిరేక ప్రకటనలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. 19వ శతాబ్దం చివరి నుంచీ కెనడాతో పంజాబ్ రాష్ట్రానికి నాటి (బ్రిటిష్ ఇండియా కాలం) నుంచీ చారిత్రకంగా సంబంధాలు ఉండడంతో–తమిళులకు శ్రీలంక ఎలాగో, పంజాబీలకు కెనడా ఇంకా అంతకన్నా ఎక్కువ ఆసక్తి ఉన్న ప్రాంతంగా మారింది. గత పదేళ్లుగా ఏటా కెనడా కాలేజీలు, యూనివర్సిటీల్లో చేరుతున్న విద్యార్థుల్లో పంజాబ్ రాష్ట్రానికి చెందిన వారే సింహభాగం అనేది తెలిసిందే. భారత విద్యార్థులు కెనడలో తమ విద్యాభ్యాసానికి చేస్తున్న వ్యయం (కోట్లాది డాలర్లు) అక్కడి ప్రావిన్సులను (రాష్ట్రాలను) ఆర్థికంగా నిలబెడుతోంది. ప్లస్ టూ తర్వాత, గ్రాడ్యుయేషన్, పీజీ కోర్సుల కోసం కెనడా వెళ్లి చదువుతున్న భారత విద్యార్థులు ఏటా దాదాపు 20 బిలియన్ల డాలర్లు (2000 కోట్ల డాలర్లు) ఖర్చుచేస్తున్నారు. ఇంత భారీ మొత్తంలో డబ్బు ఇండియా నుంచి కెనడాకు రావడంతో రెండు దేశాల మద్య సంబంధాలకు ప్రాధాన్యం పెరుగుతోంది. కెనడాలోని ఒంటారియో ప్రావిన్స్‌లో అక్కడి విద్యాసంస్థలకు కెనడా సర్కారు కన్నా భారత విద్యార్థులే ఎక్కువ మొత్తంలో ఫీజుల రూపంలో నిధులు సమకూర్చుతున్నారంటే–కెనడాలో భారత్ నుంచి వచ్చే అంతర్జాతీయ విద్యార్థులకు ప్రాముఖ్యం ఎంతో అర్థమౌతోంది. కెనడా కాలేజీల్లో స్థానిక విద్యార్థులు చెల్లించే ఫీజులకు మూడు రెట్లు ఎక్కువ ఫీజులను భారత విద్యార్థులు చెల్లిస్తున్నారని కొన్ని సంస్థలు అంచనా వేస్తున్నాయి. అంటే కెనడా ఉన్నత విద్యాసంస్థలు వసూలు చేసే అన్ని రకాల ట్యూషన్ ఫీజుల మొత్తంలో 76 శాతం భారత విద్యార్థుల నుంచే వస్తోందన్న మాట. ముఖ్యంగా ఒంటారియో ప్రావిన్సులోని విద్యాసంస్థలన్నీ భారత విద్యార్థుల ఫీజుల డబ్బుతోనే నడుస్తున్నాయని వార్తలొస్తున్నాయి. విద్యార్థుల నుంచి కెనడాకు 22.3 బిలియన్ డాలర్లు 2022 మార్చిలో కెనడా కాలేజీలు, వర్సిటీల ఆర్థిక పరిస్థితి, విద్యార్థుల సంఖ్యపై చేసిన ఒక విశ్లేషణ ప్రకారం–ఈ ఉత్తర అమెరికా ఫెడరల్ దేశంలో చదువుకునే విదేశీ విద్యార్థులు ఆ దేశ ఆర్థిక వ్యవస్థలోకి ఫీజులు, ఇతర ఖర్చుల రూపంలో 22.3 బిలియన్ (2230 కోట్ల డాలర్లు) డాలర్ల సొమ్ము పంపుతున్నారు. అంటే, కెనడా ప్రతి సంవత్సరం ఇతర దేశాలకు ఆటోమొబైల్ విడిభాగాలు, కలప, విమానాల ఎగుమతుల ద్వారా సంపాదించేదాని కన్నా అంతర్జాతీయ విద్యార్థులు చెల్లించేదే ఎక్కువ. ఇక సంఖ్య విషయానికి వస్తే 1990ల చివర్లో కెనడాలో చదువుకుంటున్న విదేశీ విద్యార్థుల సంఖ్య 40 వేలు కాగా, 2020–21 నాటికి ఈ సంఖ్య 4,20,000కు పెరిగింది. 2009 నుంచీ కెనడా కాలేజీలు, యూనివర్సిటీల్లో చేరి చదువులు పూర్తిచేసుకునే పంజాబీ, ఇతర భారత రాష్ట్రాల విద్యార్థుల సంఖ్య వేగం పుంజుకుంది. ఇండియా నుంచే గాక ఇతర దేశాల నుంచి వచ్చి కెనడాలో చదువుకునే విద్యార్థులు కూడా ఉన్నారు. 2021–22లో కెనడాలోని అన్ని విశ్వవిద్యాలయాల్లో చేరిన విద్యార్థుల్లో విదేశీ స్టూడెంట్ల సంఖ్య 17.6 శాతం ఉండగా, కెనడా కాలేజీల్లో ఈ అంతర్జాతీయ విద్యార్థల వాటా 22 శాతం ఉంది. ఒంటారియా ప్రావిన్స్ కాలేజీల్లో ఇలాంటి విద్యార్థుల ప్రవేశాల సంఖ్య 2016–17, 2019–20 మధ్య కాలంలో రెట్టింపు కావడం విశేషం. మరో ఆసక్తికర విషయం ఏమంటే–ఇండియాలో ఉన్నత విద్యను అభ్యసించే విద్యార్థుల సంఖ్యతో పోల్చితే దానికి ఆరు రెట్ల సంఖ్యలో భారత యువతీయువకులు విదేశీ విశ్వవిద్యాలయాలు, కాలేజీల్లో చేరుతున్నారని ఎడ్యుకేషన్ కన్సల్టెంగ్ సంస్థ ఒకటి అంచనా వేసింది. ఇలా విదేశీ ఉన్నత విద్యాసంస్థల్లో చేరే ఇండియన్ స్టూడెంట్స్ సంఖ్య ఇటీవల 7,70,000కు చేరింది. 2024 నాటికి పాశ్చాత్య దేశాలు సహా విదేశాలకు పోయి అక్కడ ఉన్నత విద్యనభ్యసించేవారి సంఖ్య 18 లక్షలకు చేరుతుందని అంచనా. :::విజయసాయిరెడ్డి, వైఎస్సార్సీపీ, రాజ్యసభ ఎంపీ ఇదీ చదవండి: భారత హైకమిషన్‌కు ఖలిస్తాన్ నిరసన సెగ -
అమ్మ బాబోయ్.. యూట్యూబ్ నుంచి మనోళ్లు అంత సంపాదిస్తున్నారా!
ప్రస్తుత టెక్నాలజీ యుగంలో యూట్యూబ్ అంటే తెలియని వారుండరు. సామాన్యులను సైతం సెలబ్రిటీలుగా మార్చడం యూట్యూబ్‌కే చెల్లింది. ప్రత్యేకంగా లాక్డౌన్ విధించినప్పటి నుంచి దీని వాడకం బాగా పెరిగిందనే చెప్పాలి. కొందరైతే ఉన్న ఉద్యోగాలను సైతం వదులుకునే యూట్యూబ్‌లో కంటెంట్‌ను క్రియేటర్‌గా కొంతమంది, నటులుగా మరి కొంతమంది ఇలా తమలోని సత్తాను చాటుతున్నారు. అలా కంటెంట్ క్రియేట్ చేసి మన యూట్యూబర్లు ఏకంగా రూ. 6,800 కోట్లు సంపాదించారట. వినడానికి షాక్ అనిపించినా నమ్మాలి మరీ.. 2020 సంవత్సరంలో మన ఎకానమీకి ఇంత మొత్తం ఆదాయం వచ్చిందని ఆక్స్ఫర్డ్ ఎకనామిక్స్ అనే స్వతంత్ర కన్సల్టింగ్ సంస్థ ఈ రిపోర్టు వెల్లడించింది. అంతేకాకుండా మన దేశంలో యూట్యూబ్ ప్రభావం ఆర్థికంగానూ, సామాజికంగానూ, కల్చరల్‌గా ఎలా ఉందనే అంశాలని ఈ కన్సల్టింగ్సంస్థ స్టడీ చేసింది. మన జీడీపీకి రూ. 6,800 కోట్లు తేవడమే కాకుండా, 6,83,900 ఫుల్ టైమ్‌తో సమానమైనఉద్యోగాలను కూడా యూట్యూబ్ ఇచ్చిందని ఆ నివేదిక తెలపింది. భారతదేశంలో 1,00,000 కంటే ఎక్కువ మంది సబ్స్క్రైబర్లతో ఉన్న ఛానెల్‌ల సంఖ్య ఇప్పుడు 40,000 వద్ద ఉన్నట్లు, ఇవి సంవత్సరానికి 45% కంటే ఎక్కువ వృద్ధిని సాధిస్తున్నట్లు తెలిపింది. యూట్యూబ్ సృష్టికర్తలు తమ కంటెంట్‌తో డబ్బు సంపాదించేందుకు ఎనిమిది విభిన్న మార్గాలను ఇందులో పొందుపరిచారు. వీటిని ఉపయోగించుకుంటూ కనీసం లక్ష లేదా అంతకంటే ఎక్కువ ఆదాయాన్ని ఆర్జించే యూట్యూబ్ ఛానెల్‌ల సంఖ్య సంవత్సరానికి 60% పైగా పెరిగినట్లు నివేదిక పేర్కొంది. -
ఏడాది వేతనం విరాళంగా ప్రకటించిన మంత్రులు!
సాక్షి, బెంగళూరు: మంత్రులు ఏడాది వేతనం, ఎమ్మెల్యేల నేల వేతనం కరోనా పరిహార నిధికి ఇవ్వాలని సీఎం బీఎస్ యడియూరప్ప విజ్జప్తి చేశారు. గురువారం జెడ్పీ సీఈఓ, జిల్లా ఎస్పీలతో ఆయన వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. కరోనా నియమాలు పాటించని వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్లకు సూచించారు. రెసిడెన్షియల్ హాస్టళ్లకను కరోనాకేర్ సెంటర్లకు వినియోగించుకోవాలని సూచించారు. కాగా తమ ఏడాది వేతనాన్ని విరాళంగా అందించేందుకు మంత్రులు ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు రాష్ట్రంలో కోవిడ్ సహాయక చర్యల కోసం ఏడాది వేతనాన్ని ఇవ్వాలని నిర్ణయించుకున్నట్లు రెవెన్యూశాఖ మంత్రి ఆర్ ఆశోక తెలిపారు. మరోవైపు కర్ణాటకలో కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. గత 24 గంటల్లో 35,024 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గురువారం కొత్తగా 270 మంది మృత్యువాపడ్డారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 14,74,846కి పెరిగింది.మరణాల సంఖ్యd 15,306గా ఉంది. చదవండి: విషాదం: కరోనా రాకూడదని ముక్కులోకి నిమ్మరసం.. -
మానసిక వికలాంగురాలికి విదేశీయుల చేయూత
చండ్రాయనిపల్లి(బుక్కపట్నం): మండలంలోని చండ్రాయనిపల్లికి చెందిన ఓ మానసిక వికలాంగురాలికి విదేశీయులు చేయూతనిందించారు. గ్రామానికి చెందిన రామాంజనమ్మ పుట్టుకతోనే వికలాంగురాలు. ఈమెకు తల్లి లేదు. తండ్రి ఉన్నారు. పుట్టపర్తి మండలం చెర్లోపల్లి ప్రాథమికోన్నత పాఠశాల హెచ్ఎం చెన్నకృష్ణారెడ్డి పక్కనే ఉన్న తరుగువాండ్లపల్లికి చెందిన వ్యక్తి కావటంతో విషయం తెలుసుకొని తన వంతుగా చేయూతనిందిస్తూ గ్రీసు దేశానికి చెందిన సత్యసాయి భక్తుడు డిబిలీయస్ సహకారంతో సుమారు లక్ష రూపాయలతో షెడ్డు నిర్మాణం పనులు చేపట్టారు. ఇందులో రూ.10 వేలు చెన్నకృష్ణారెడ్డి వాటాగా విరాళం అందించారు. ఆదివారం గ్రీసు దేశస్తుడు గ్రామానికి వచ్చారు. ఆయనకు ప్రధానోపాధ్యాయుడు, గ్రామస్తులు ఘనంగా స్వాగతం పలికారు. విదేశీయులు చేయూతనిందించేందుకు కృషి చేసిన చెన్నకృష్ణారెడ్డికి రామాం జనమ్మ తండ్రి,గ్రామస్తులు కృతజ్ఞతలు తెలిపారు. -
అఫ్ఘాన్‌కు చేయూత అందిస్తాం
శాంతి, సుస్థిరతకు పాటుపడతాం: ప్రధాని మోదీ న్యూఢిల్లీ: అఫ్ఘానిస్థాన్‌లో శాంతి స్థాపన, సుస్థిరతకు తమ వంతు సహకారం అందిస్తామని ఆ దేశ అధ్యక్షుడు అష్రాఫ్ ఘనీకి ప్రధాని నరేంద్రమోదీ హమీనిచ్చారు. రక్షణ, మౌలిక వసతులు, వ్యవసాయం, రవాణా తదితర రంగాల్లో సాయం అందిస్తామని చెప్పారు. అధ్యక్ష పగ్గాలు చేపట్టాక సోమవారం తొలిసారి భారత్ పర్యటనకు వచ్చిన ఘనీ.. మంగళవారం మోదీతో సమావేశమై పలు ద్వైపాక్షిక అంశాలపై చర్చించారు. తాము ఎదుర్కొంటున్న అతి పెద్ద సవాలు ఉగ్రవాదమేనన్నారు. ముష్కర తండాలను సమూలంగా నిర్మూలించాల్సిన అవసరం ఉందని ఇరువురు నేతలు స్పష్టంచేశారు. చర్చల అనంతరం ప్రధాని, ఘనీ విలేకరుల సమావేశంలో మాట్లాడారు. సరిహద్దు, రాజకీయ అడ్డంకులు ఉన్నా ఇరు దేశాల సంబంధాలు పురోగమిస్తున్నాయని మోదీ అన్నారు. హింసకు తావు లేకుండా అఫ్ఘాన్ అభివృద్ధి మార్గంలో పురోగమించడం ఇరుదేశాలకు ఉపయుక్తమని వ్యాఖ్యానించారు. ఉగ్రవాదానికి పొరుగు దేశాల నుంచి మద్దతు నిలిచిపోయినప్పుడే అప్ఘాన్ అభివృద్ధి సాధ్యమంటూ పరోక్షంగా పాకిస్తాన్ తీరును ఎండగట్టారు. -
అందరి సహకారంతో ప్రగతిబాట
కర్మాగారం త్వరలో రానుందని, మెరైన్ ఇన్స్టిట్యూట్ను స్థాపిస్తారని తెలిపారు. జిల్లా అభివృద్ధికి సహాయసహకారాలు అందిస్తున్న ఎంపీలకు, ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు, ప్రజాప్రతినిధులకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో జెడ్పీ చైర్మన్ బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డి, సూళ్లూరుపేట ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య, ఎమ్మెల్సీ వి.బాలసుబ్రమణ్యం, ఎస్పీ సెంథిల్‌కుమార్, జేసీ ఇంతియాజ్, ఏజేసీ రాజ్‌కుమార్, నగర పాలక సంస్థ కమిషనర్ చక్రధర్‌బాబు, డీఆర్ఓ సుదర్శన్‌రెడ్డి, నెల్లూరు మేయర్ అజీజ్ పాల్గొన్నారు. జన్మభూమి మాఊరులో భాగంగా పేదరికంపై గెలుపు, పొలం పిలుస్తోంది, బడి పిలుస్తోంది, నీరు-చెట్టు, పెన్షన్ల పంపిణీ, ఆరోగ్య క్యాంపులు, వెటర్నరీ క్యాంపులు జరిపామన్నారు. దేశంలోనే అతిపెద్ద కార్గో హ్యాడ్లింగ్ పోర్టుగా రూపుదిద్దుకుంటున్న కృష్ణపట్నం జిల్లాకే తలమానికమని, ఇప్పటివరకు 42 బెర్తులకు గాను 12 బెర్తులు నిర్మించారన్నారు. దుగ్గరాజపట్నం పోర్టు కూడా త్వరలో వస్తుందన్నారు. నెల్లూరులోని ప్రజలు రాబోయే 30 ఏళ్ల వరకు మంచినీటి కోసం ఇబ్బందులు పడకుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు. హడ్కో ద్వారా రూ.550 కోట్ల ఆర్థిక సాయంతో సమగ్ర మంచినీటి పథకానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ప్రతిపాదనలు పంపామన్నా రు. హడ్కో సాయంతో నగరంలో భూగ ర్భ డ్రైనేజీ ఏర్పాటు కోసం రాష్ట్రప్రభుత్వానికి ప్రతిపాదనలు పం పామని తెలిపారు. నీరుచెట్టు కింద నగరంలో 63 వేల మొక్కలు నాటామన్నారు. ప్రతి ఎంపీ గ్రామాలను దత్తత తీసుకొని ఆదర్శ గ్రామాలుగా తీర్చిదిద్దాలన్న పీఎం నరేంద్రమోడీ పిలుపు మేరకు ఎంపీ సచిన్ టెండుల్కర్ గూడూరులోని పుట్టంరాజువారి కండ్రిగను, నెల్లూరు ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి మర్రిపాడులోని కంపసముద్రాన్ని, తిరుపతి ఎంపీ వరప్రసాద్‌రావు పెళ్లకూరులోని చిల్లకూరును, వెంకటాచలంలోని కనుపూరును దత్తత తీసుకున్నారని, వీటి పురోభివృద్ధి కోసం చర్యలు తీసుకున్నామని తెలిపారు. జిల్లాలోని రైతులంతా నీటిని పొదుపుగా వాడుకోవాలని కోరారు. ఈ రబీ సీజన్లో 2.14 లక్షల హెక్టార్లలో వరి, మినుము, శనగ, వేరుశనగ, పొగాకు మొదలైన పైర్లు సాగు చేశారన్నారు. ఈ సీజన్లో రూ.2,900 కోట్ల పంట రుణాలు అందించాల్సి ఉండగా, ఇప్పటివరకు 3.78లక్షల మంది రైతులకు రూ.1,920 కోట్ల రుణాలు ఇచ్చామన్నారు. జాతీయ ఆహార భద్రత మిషన్ కింద పప్పుధాన్యాల దిగుబడి పెంచేందుకు 3.92 కోట్లతో విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు, స్ప్రింకర్లు, వ్యవసాయ పనిముట్లు 50 శాతం రాయితీపై సరఫరా చేశామన్నారు. వ్యవసాయ యాంత్రీకరణ కోసం 4.73 కోట్ల విలువ గల సేద్య యంత్ర పరికరాలు 50 శాతం రాయితీపై సరఫరా చేశామన్నారు. వర్షాభావ పరిస్థితులతో జిల్లాలోని వరికుంటపాడు, కొండాపురం, దుత్తలూరు, ఉదయగిరి, మర్రిపాడు, రాపూరు, సైదాపురం మండలాలను కరువు మండలాలుగా ప్రభుత్వం ప్రకటించిందన్నారు. ప్రభుత్వం ప్రకటించిన రైతు రుణమాఫీ కోసం జిల్లాలో లక్షా 55వేల రుణ ఖాతాలకు రూ.678 కోట్లు మాఫీచేసి తొలి విడత కింద రూ.206 కోట్లను ప్రభుత్వం విడుదల చేసిందన్నారు. ఎన్టీఆర్ ఆరోగ్య భరోసా కింద జిల్లాలో 2.5లక్షల మంది వృద్ధులు, వితంతువులు, వికలాంగులు, చేనేత, కల్లుగీత కార్మికులకు ప్రతి నెలా రూ.26 కోట్లను గ్రామ, వార్డు కమిటీల సమక్షంలో పింఛన్లు పంపిణీ చేస్తున్నామన్నారు. గతేడాది సెప్టెంబర్ నుంచి మహిళా సంఘాల ఆధ్వర్యంలో ఇసుక రీచ్‌ల నిర్వహణ ప్రారంభించామన్నారు. జిల్లాలోని 34 గ్రామాల్లోని ఇసుక రీచ్‌ల్లో ఒక లక్షా 41వేల క్యూబిక్ మీటర్ల ఇసుకను విక్రయించి రూ.8.5 కోట్ల ఆదాయం సమకూర్చుకున్నామన్నారు. జిల్లాలోని 4,050 స్వయం సహాయక సంఘాలకు రూ.118 కోట్లను బ్యాంకు లింకేజీ ద్వారా వడ్డీ లేని రుణాల కింద ఇచ్చామన్నారు. జిల్లా పరిషత్‌కు రాష్ట్ర ఆర్థిక సంఘం రూ.34.83 కోట్ల నిధులు మంజూరు చేసిందన్నారు. 13వ ఆర్థిక సంఘం నిధులు కింద జిల్లాకు రూ.15 కోట్లు మంజూరయ్యాయని తెలిపారు. ఆస్తుల నిర్వహణ కింద 90 పనులకు రూ.కోటి 66 లక్షలను మంజూరు చేశారని తెలిపారు. ఎన్టీఆర్ సుజల పథకం కింద గ్రామీణ ప్రాంత ప్రజలకు పూర్తి రక్షిత మంచినీరు అందించేందుకు 13 ఆర్ఓ ప్లాంట్లు ప్రారంభించామన్నారు. స్వచ్ఛభారత్ మిషన్‌లో భాగంగా 1.11లక్షల వ్యక్తిగత మరుగుదొడ్లు మంజూరు చేశామని, ఇప్పటివరకు 8,500 మరుగుదొడ్లు పూర్తయ్యాయని తెలిపారు. చంద్రన్న సంక్రాంతి పథకం కింద 8.26 లక్షల మంది తెల్లకార్డుదారులకు రూ.20 కోట్ల విలువైన సరుకులను ఉచితంగా పంపిణీ చేశామన్నారు. జిల్లాలో ఎర్రచందనం అక్రమ రవాణాను అరికట్టడంలో భాగంగా 75 కేసులు నమోదు చేసి రూ.47 కోట్ల విలువ చేసే ఎర్ర చందనం దుంగలను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. 46 వాహనాలను స్వాధీనం చేసుకొని 340 మందిని పోలీసులు అరెస్టు చేశారన్నారు. వివిధ కళాశాలల్లో 10వ తరగతి అనంతరం కోర్సులు చదువుతున్న 10వేల మంది విద్యార్థులకు రూ.7 కోట్ల పోస్టుమెట్రిక్ ఉపకార వేతనాలు ఇచ్చామన్నారు. మత్స్యకారులకు వృత్తి లాభసాటిగా చేసేందుకు 52 చెరువుల్లో, ఒక రిజర్వాయర్‌లో 28 లక్షల చేప పిల్లలను విడుదల చేశామన్నారు. కోట మండలం కొత్తపట్నంలో రూ.172 కోట్ల పెట్టుబడితో 536 ఎకరాల విస్తీర్ణంలో కృష్ణపట్నం ఇంటర్నేషనల్ లెదర్ కాంప్లెక్స్ ప్రైవేట్ లిమిటెడ్ వారు తోళ్ల పరిశ్రమను స్థాపించనున్నారని తెలిపారు. సర్వశిక్షా అభియాన్ పథకం కింద పాఠశాలల్లో 628 అదనపు తరగతి గదులు, 2 నూతన ప్రాథమిక పాఠశాలల భవనాలు, 424 బాలికల మరుగుదొడ్లు నిర్మాణంలో ఉన్నాయన్నారు. ఉపాధి హామీ పథకం కింద ఈ ఆర్థిక సంవత్సరంలో 5.6 లక్షల జాబ్‌కార్డులు మంజూరు చేసి 2.5లక్షల మందికి పనిదినాలు కల్పించి రూ.91 కోట్లు ఖర్చు చేశామన్నారు. జిల్లాకు రూ.181 కోట్లతో హైఓల్టేజీ డిస్ట్రిబ్యూషన్ వ్యవస్థ మంజూరైందని, గ్రామీణ ప్రాంతాల్లో నిరంతర విద్యుత్ అందించేందుకు రూ.1,030 కోట్లు, సమీకృత విద్యుద్దీకరణ పథకం కింద పట్టణ ప్రాంత అభివృద్ధి పనుల కోసం రూ.110 కోట్లతో ప్రభుత్వానికి ప్రతిపాదనలు వెళ్లాయన్నారు. -
వరద బాధితులకు రూ. 20 కోట్ల సాయం
న్యూఢిల్లీ: జమ్మూకాశ్మీర్ వరద బాధితులకు తమ వంతు సాయం అందించేందుకు ప్రముఖ వాహన తయారీ సంస్థ బజాజ్ ఆటో ముందుకు వచ్చింది. ప్రధాని జాతీయ సహాయ నిధికి తన వంతుగా 20 కోట్ల రూపాయల విరాళం ప్రకటించింది. వరదల కారణంగా సర్వం కోల్పోయిన జమ్మూకాశ్మీర్ వాసులకు ఆదుకోవాలని భావించి ఈ సహాయం చేస్తున్నట్టు బజాజ్ ఆటో చైర్మన్ రాహుల్ బజాబ్ తెలిపారు. అలాగే వరద ప్రభావిత ప్రాంతాల్లో ప్రభుత్వం చేపట్టే పునరావాస చర్యల్లోనూ తాము భాగస్వాములవుతామని హామీయిచ్చారు.