![Karnataka Ministers Decided To Contribute Their One Year Salary - Sakshi](/styles/webp/s3/article_images/2021/04/30/32.jpg.webp?itok=C-B48s4k)
సాక్షి, బెంగళూరు: మంత్రులు ఏడాది వేతనం, ఎమ్మెల్యేల నేల వేతనం కరోనా పరిహార నిధికి ఇవ్వాలని సీఎం బీఎస్ యడియూరప్ప విజ్జప్తి చేశారు. గురువారం జెడ్పీ సీఈఓ, జిల్లా ఎస్‌పీలతో ఆయన వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. కరోనా నియమాలు పాటించని వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్లకు సూచించారు. రెసిడెన్షియల్ హాస్టళ్లకను కరోనాకేర్ సెంటర్లకు వినియోగించుకోవాలని సూచించారు.
కాగా తమ ఏడాది వేతనాన్ని విరాళంగా అందించేందుకు మంత్రులు ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు రాష్ట్రంలో కోవిడ్ సహాయక చర్యల కోసం ఏడాది వేతనాన్ని ఇవ్వాలని నిర్ణయించుకున్నట్లు రెవెన్యూశాఖ మంత్రి ఆర్ ఆశోక తెలిపారు. మరోవైపు కర్ణాటకలో కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. గత 24 గంటల్లో 35,024 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గురువారం కొత్తగా 270 మంది మృత్యువాపడ్డారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 14,74,846కి పెరిగింది.మరణాల సంఖ్యd 15,306గా ఉంది.
Comments
Please login to add a commentAdd a comment