డిప్యూటీ సీఎం అజిత్ పవార్
పుణె: కరోనా వైరస్ పాజిటివ్ కేసు మహారాష్ట్రలో మళ్లీ పెరుగుతున్నాయి. తాజాగా రాష్ట్రంలోని 10 మంది మంత్రులు, 20 మంది ఎమెల్యేలు కోవిడ్ బారినపడినట్లు డిప్యూటీ సీఎం అజిత్ పవార్ వెల్లడించారు. కరోనా కేసులు పెరుగుతున్న క్రమంలో కఠినమైన ఆంక్షలు అమలు చేస్తున్నామని పేర్కొన్నారు.
‘10మంది మంత్రులు, 20 మంది ఎమ్మెల్యేలకి కోవిడ్ పాజిటివ్‌గా నిర్దారణ అయింది. అయితే ప్రతి ఒక్కరు కొత్త ఏడాది, జన్మదిన వేడుకల్లో పాల్గొంటున్నారు. అయితే కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కూడా విస్తరిస్తుంది, ప్రజలంతా జాగ్రత్తగా ఉండాలి. రాష్ట్రంలోని ముంబై, పుణె నగరాల్లో కరోనా వైరస్ కేసులు పెరుగుతున్నాయి’ అని అజిత్ పవార్ తెలిపారు.
కేసులు పెరుగుతున్న కారణంగా కఠిన చర్యలు అమలుచేస్తున్నామని తెలిపారు. ప్రతి ఒక్కరు కోవిడ్ నియంత్రణ చర్యలను పాటించాలని ప్రజలకు విజ్ఞప్తిచేశారు. అదే విధంగా కరోనా సోకిన మంత్రులు, ఎమ్మెల్యేలకు సన్నిహితంగా ఉన్నవారంతా కోవిడ్ నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలని డిప్యూటి సీఎం కోరారు.
Comments
Please login to add a commentAdd a comment