అందరి సహకారంతో ప్రగతిబాట
కర్మాగారం త్వరలో రానుందని, మెరైన్ ఇన్‌స్టిట్యూట్‌ను స్థాపిస్తారని తెలిపారు. జిల్లా అభివృద్ధికి సహాయసహకారాలు అందిస్తున్న ఎంపీలకు, ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు, ప్రజాప్రతినిధులకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో జెడ్పీ చైర్మన్ బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డి, సూళ్లూరుపేట ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య, ఎమ్మెల్సీ వి.బాలసుబ్రమణ్యం, ఎస్పీ సెంథిల్‌కుమార్, జేసీ ఇంతియాజ్, ఏజేసీ రాజ్‌కుమార్, నగర పాలక సంస్థ కమిషనర్ చక్రధర్‌బాబు, డీఆర్‌ఓ సుదర్శన్‌రెడ్డి, నెల్లూరు మేయర్ అజీజ్ పాల్గొన్నారు.
జన్మభూమి మాఊరులో భాగంగా పేదరికంపై గెలుపు, పొలం పిలుస్తోంది, బడి పిలుస్తోంది, నీరు-చెట్టు, పెన్షన్ల పంపిణీ, ఆరోగ్య క్యాంపులు, వెటర్నరీ క్యాంపులు జరిపామన్నారు.
దేశంలోనే అతిపెద్ద కార్గో హ్యాడ్లింగ్ పోర్టుగా రూపుదిద్దుకుంటున్న కృష్ణపట్నం జిల్లాకే తలమానికమని, ఇప్పటివరకు 42 బెర్తులకు గాను 12 బెర్తులు నిర్మించారన్నారు. దుగ్గరాజపట్నం పోర్టు కూడా త్వరలో వస్తుందన్నారు.
నెల్లూరులోని ప్రజలు రాబోయే 30 ఏళ్ల వరకు మంచినీటి కోసం ఇబ్బందులు పడకుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు. హడ్కో ద్వారా రూ.550 కోట్ల ఆర్థిక సాయంతో సమగ్ర మంచినీటి పథకానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ప్రతిపాదనలు పంపామన్నా రు. హడ్కో సాయంతో నగరంలో భూగ ర్భ డ్రైనేజీ ఏర్పాటు కోసం రాష్ట్రప్రభుత్వానికి ప్రతిపాదనలు పం పామని తెలిపారు. నీరుచెట్టు కింద నగరంలో 63 వేల మొక్కలు నాటామన్నారు.
ప్రతి ఎంపీ గ్రామాలను దత్తత తీసుకొని ఆదర్శ గ్రామాలుగా తీర్చిదిద్దాలన్న పీఎం నరేంద్రమోడీ పిలుపు మేరకు ఎంపీ సచిన్ టెండుల్కర్ గూడూరులోని పుట్టంరాజువారి కండ్రిగను, నెల్లూరు ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి మర్రిపాడులోని కంపసముద్రాన్ని, తిరుపతి ఎంపీ వరప్రసాద్‌రావు పెళ్లకూరులోని చిల్లకూరును, వెంకటాచలంలోని కనుపూరును దత్తత తీసుకున్నారని, వీటి పురోభివృద్ధి కోసం చర్యలు తీసుకున్నామని తెలిపారు.
జిల్లాలోని రైతులంతా నీటిని పొదుపుగా వాడుకోవాలని కోరారు. ఈ రబీ సీజన్‌లో 2.14 లక్షల హెక్టార్లలో వరి, మినుము, శనగ, వేరుశనగ, పొగాకు మొదలైన పైర్లు సాగు చేశారన్నారు. ఈ సీజన్‌లో రూ.2,900 కోట్ల పంట రుణాలు అందించాల్సి ఉండగా, ఇప్పటివరకు 3.78లక్షల మంది రైతులకు రూ.1,920 కోట్ల రుణాలు ఇచ్చామన్నారు. జాతీయ ఆహార భద్రత మిషన్ కింద పప్పుధాన్యాల దిగుబడి పెంచేందుకు 3.92 కోట్లతో విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు, స్ప్రింకర్లు, వ్యవసాయ పనిముట్లు 50 శాతం రాయితీపై సరఫరా చేశామన్నారు. వ్యవసాయ యాంత్రీకరణ కోసం 4.73 కోట్ల విలువ గల సేద్య యంత్ర పరికరాలు 50 శాతం రాయితీపై సరఫరా చేశామన్నారు.
వర్షాభావ పరిస్థితులతో జిల్లాలోని వరికుంటపాడు, కొండాపురం, దుత్తలూరు, ఉదయగిరి, మర్రిపాడు, రాపూరు, సైదాపురం మండలాలను కరువు మండలాలుగా ప్రభుత్వం ప్రకటించిందన్నారు.
ప్రభుత్వం ప్రకటించిన రైతు రుణమాఫీ కోసం జిల్లాలో లక్షా 55వేల రుణ ఖాతాలకు రూ.678 కోట్లు మాఫీచేసి తొలి విడత కింద రూ.206 కోట్లను ప్రభుత్వం విడుదల చేసిందన్నారు.
ఎన్టీఆర్ ఆరోగ్య భరోసా కింద జిల్లాలో 2.5లక్షల మంది వృద్ధులు, వితంతువులు, వికలాంగులు, చేనేత, కల్లుగీత కార్మికులకు ప్రతి నెలా రూ.26 కోట్లను గ్రామ, వార్డు కమిటీల సమక్షంలో పింఛన్లు పంపిణీ చేస్తున్నామన్నారు.
గతేడాది సెప్టెంబర్ నుంచి మహిళా సంఘాల ఆధ్వర్యంలో ఇసుక రీచ్‌ల నిర్వహణ ప్రారంభించామన్నారు. జిల్లాలోని 34 గ్రామాల్లోని ఇసుక రీచ్‌ల్లో ఒక లక్షా 41వేల క్యూబిక్ మీటర్ల ఇసుకను విక్రయించి రూ.8.5 కోట్ల ఆదాయం సమకూర్చుకున్నామన్నారు.
జిల్లాలోని 4,050 స్వయం సహాయక సంఘాలకు రూ.118 కోట్లను బ్యాంకు లింకేజీ ద్వారా వడ్డీ లేని రుణాల కింద ఇచ్చామన్నారు.
జిల్లా పరిషత్‌కు రాష్ట్ర ఆర్థిక సంఘం రూ.34.83 కోట్ల నిధులు మంజూరు చేసిందన్నారు. 13వ ఆర్థిక సంఘం నిధులు కింద జిల్లాకు రూ.15 కోట్లు మంజూరయ్యాయని తెలిపారు. ఆస్తుల నిర్వహణ కింద 90 పనులకు రూ.కోటి 66 లక్షలను మంజూరు చేశారని తెలిపారు.
ఎన్‌టీఆర్ సుజల పథకం కింద గ్రామీణ ప్రాంత ప్రజలకు పూర్తి రక్షిత మంచినీరు అందించేందుకు 13 ఆర్‌ఓ ప్లాంట్లు ప్రారంభించామన్నారు.
స్వచ్ఛభారత్ మిషన్‌లో భాగంగా 1.11లక్షల వ్యక్తిగత మరుగుదొడ్లు మంజూరు చేశామని, ఇప్పటివరకు 8,500 మరుగుదొడ్లు పూర్తయ్యాయని తెలిపారు.
చంద్రన్న సంక్రాంతి పథకం కింద 8.26 లక్షల మంది తెల్లకార్డుదారులకు రూ.20 కోట్ల విలువైన సరుకులను ఉచితంగా పంపిణీ చేశామన్నారు.
జిల్లాలో ఎర్రచందనం అక్రమ రవాణాను అరికట్టడంలో భాగంగా 75 కేసులు నమోదు చేసి రూ.47 కోట్ల విలువ చేసే ఎర్ర చందనం దుంగలను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. 46 వాహనాలను స్వాధీనం చేసుకొని 340 మందిని పోలీసులు అరెస్టు చేశారన్నారు.
వివిధ కళాశాలల్లో 10వ తరగతి అనంతరం కోర్సులు చదువుతున్న 10వేల మంది విద్యార్థులకు రూ.7 కోట్ల పోస్టుమెట్రిక్ ఉపకార వేతనాలు ఇచ్చామన్నారు.
మత్స్యకారులకు వృత్తి లాభసాటిగా చేసేందుకు 52 చెరువుల్లో, ఒక రిజర్వాయర్‌లో 28 లక్షల చేప పిల్లలను విడుదల చేశామన్నారు.
కోట మండలం కొత్తపట్నంలో రూ.172 కోట్ల పెట్టుబడితో 536 ఎకరాల విస్తీర్ణంలో కృష్ణపట్నం ఇంటర్నేషనల్ లెదర్ కాంప్లెక్స్ ప్రైవేట్ లిమిటెడ్ వారు తోళ్ల పరిశ్రమను స్థాపించనున్నారని తెలిపారు.
సర్వశిక్షా అభియాన్ పథకం కింద పాఠశాలల్లో 628 అదనపు తరగతి గదులు, 2 నూతన ప్రాథమిక పాఠశాలల భవనాలు, 424 బాలికల మరుగుదొడ్లు నిర్మాణంలో ఉన్నాయన్నారు.
ఉపాధి హామీ పథకం కింద ఈ ఆర్థిక సంవత్సరంలో 5.6 లక్షల జాబ్‌కార్డులు మంజూరు చేసి 2.5లక్షల మందికి పనిదినాలు కల్పించి రూ.91 కోట్లు ఖర్చు చేశామన్నారు.
జిల్లాకు రూ.181 కోట్లతో హైఓల్టేజీ డిస్ట్రిబ్యూషన్ వ్యవస్థ మంజూరైందని, గ్రామీణ ప్రాంతాల్లో నిరంతర విద్యుత్ అందించేందుకు రూ.1,030 కోట్లు, సమీకృత విద్యుద్దీకరణ పథకం కింద పట్టణ ప్రాంత అభివృద్ధి పనుల కోసం రూ.110 కోట్లతో ప్రభుత్వానికి ప్రతిపాదనలు వెళ్లాయన్నారు.