![వరద బాధితులకు రూ. 20 కోట్ల సాయం](/styles/webp/s3/article_images/2017/09/2/81410949673_625x300.jpg.webp?itok=CdYn7lRn)
వరద బాధితులకు రూ. 20 కోట్ల సాయం
న్యూఢిల్లీ: జమ్మూకాశ్మీర్ వరద బాధితులకు తమ వంతు సాయం అందించేందుకు ప్రముఖ వాహన తయారీ సంస్థ బజాజ్ ఆటో ముందుకు వచ్చింది. ప్రధాని జాతీయ సహాయ నిధికి తన వంతుగా 20 కోట్ల రూపాయల విరాళం ప్రకటించింది.
వరదల కారణంగా సర్వం కోల్పోయిన జమ్మూకాశ్మీర్ వాసులకు ఆదుకోవాలని భావించి ఈ సహాయం చేస్తున్నట్టు బజాజ్ ఆటో చైర్మన్ రాహుల్ బజాబ్ తెలిపారు. అలాగే వరద ప్రభావిత ప్రాంతాల్లో ప్రభుత్వం చేపట్టే పునరావాస చర్యల్లోనూ తాము భాగస్వాములవుతామని హామీయిచ్చారు.