రాచర్ల అడవిలో అస్తిపంజరం లభ్యం | Skeleton In Racharla Forest | Sakshi
Sakshi News home page

రాచర్ల అడవిలో అస్తిపంజరం లభ్యం

Published Thu, Aug 2 2018 2:58 PM | Last Updated on Tue, Oct 16 2018 4:50 PM

Skeleton In Racharla  Forest - Sakshi

వెంకటి

వేమనపల్లి(బెల్లంపల్లి) : రాచర్ల అటవీ ప్రాంతంలో బుధవారం ఉదయం అస్తిపంజరం లభ్యమైంది. నెల రోజుల క్రితం అదృశ్యమైన ముల్కలపేట గ్రామానికి చెందిన దున్న వెంకటిదిగా కుటుంబ సభ్యులు గుర్తించారు. కుటుంబీకుల కథనం ప్రకారం వెంకటి(43) కొన్ని నెలలుగా మతి స్థిమితం లేక తిరుగుతున్నాడు. ఇంటి నుంచి వెళ్లి పోయిన నాటి నుంచి కుటుంబ సభ్యులు గాలిస్తున్నారు. ఈ నేపథ్యంలో వెంకటి రాచర్ల అటవీ ప్రాంతంలోని చెట్టుకు ఉరి పెట్టుకున్నాడు.

వెంచపల్లి గ్రామానికి చెందిన పశువుల కాపరులు గమనించి కుటుంబీకులకు సమాచారం ఇచ్చారు. మృతదేహం గుర్తు పట్టలేకుండా కుళ్లి పోగా చెట్టుపై ఉన్న దుస్తులను బట్టి అతను వెంకటిగా గుర్తించారు. మృతుడి భార్య  కవిత ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై భూమేశ్‌ తెలిపారు. మృతుడికి ఇద్దరు కూతుళ్లు సంకీర్తన, స్పందన, ఒక కుమారుడు రిత్విక్‌ ఉన్నారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement