Skeleton find out
-
వ్యక్తి అస్తిపంజరం లభ్యం
సాక్షి, టేకుమట్ల(వరంగల్) : గుర్తు తెలియని వ్యక్తి ఆస్తిపంజరం రాఘవరెడ్డిపేట శివారులో సోమవారం లభ్యమైందని ఇన్చార్జి ఎస్సై అనిల్‌కుమార్ తెలిపారు. పోలీసుల కథనం ప్రకారం.. మండలంలోని రాఘవరెడ్డిపేట శివారులో రోడ్డు పక్కన్న సంచిలో మూటగట్టిన అస్తిపంజరం సోమవారం వెలుగులోకి వచ్చింది. రోడ్డు పక్కన ఉన్న సంచి వర్షానికి తడవడంతో దాన్ని కుక్కలు పికాయి. దీంతో సంచిలోంచి పుర్రె,, చెప్పులు, కాలిబొక్కలు బయటకు వచ్చాయి. అటుగా వెళ్లిన రైతులు చూసి పోలీసులకు సమాచారం అందించారు. దీంతో భూపాలపల్లి డీఎస్పీ కిరణ్‌కుమార్, సీఐ శ్రీనివాస్, ఎస్సై అనిల్‌కుమార్ సంఘటనా స్థలానికి చేరుకోని విచారణ చేపట్టారు. మృతుడికి స్వెటర్ ఉండటంతో డిసెంబర్, జనవరిలో ఎవరో చంపి సంచిలో మూటగట్టి ఇక్కడ పడేసినట్లుగా పోలీసులు అంచనా వేస్తున్నారు. మృతదేహం కుళ్లిపోయి వాసన రాకుండా ఉండేందుకు హంతకులు పాలిథిన్ సంచుల్లో కట్టి యూరియా సంచిలో పెట్టి రోడ్డు పక్కన పడేశారు. అయితే 5, 6 నెలల క్రితం సంచి ఇక్కడ లేదని ఎండాకాలంలో ఈ ప్రాంతంలో చెత్తను కాలపెట్టినప్పుడు సంచి కూడా కాలి ఉండేదని గ్రామస్తులు చెబుతున్నారు. పరకాలకు చెందిన వ్యక్తిగా.. రాఘవరెడ్డిపేటలో అస్తి పంజరం లభించడంతో పోలీసులు అన్ని పోలీస్స్టేషన్లకు సమాచారం అందించడంతో పరకాల రాజుపేటకు చెందిన తుమ్మల శ్రీకాంత్ (18) 5 నెలల నుంచి కనపడటం లేదని ఫిర్యాదు వచ్చిందని పరకాల సీఐ మధు సంఘటన స్థలానికి వచ్చారు. శ్రీకాంత్‌కు సంబంధించిన బంధువులకు, తల్లిదండ్రులకు సమాచారం అందించగా రాత్రి అయినందున అందుబాటులో ఎవరూ లేరని సంఘటన స్థలానికి రాలేదు. శ్రీకాంత్‌కు తెలిసిన మిత్రులు ఫొటో తీసుకుని రాగా శ్రీకాంత్ ఫొటోలోని చెప్పులు, చేతిదండ, పాయింట్ ఒకే రకంగా ఉన్నాయి. కాని శ్రీకాంత్ సంబంధీకులు ఎవరూ రాకపోవడంతో అస్తి పంజరాన్ని, స్వెటర్, చెప్పులను ప్యాక్ చేసి ఎంజీఎం మార్చురీకి తరలించారు. -
గుర్తుతెలియని వ్యక్తి అస్థిపంజరం లభ్యం
తానూరు(ముథోల్): మండలంలోని మొగ్లి గ్రామ శివారులో గుర్తుతెలియని వ్యక్తి అస్థిపంజరం లభ్యమైనట్లు ఎస్సై వెంకటరెడ్డి తెలిపారు. ఎస్సై తెలిపిన ప్రకారం వివరాలు.. గ్రామానికి చెందిన పశువుల కాపరులు శనివారం గ్రామ శివారు అటవీ ప్రాంతంలో ఓ సంచిలో ఉన్న అస్థిపంజరం గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. సంçఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు దానిని పరిశీలించారు. మూడు నెలల క్రితం ఎవరో గుర్తుతెలియని వ్యక్తులు సంచిలో మృతదేహన్ని తీసుకువచ్చి పడేసి ఉంటారని అనుమానిస్తున్నారు. ముథోల్ సీఐ శ్రీనివాస్ సంఘటన స్థలాన్ని పరిశీలించి వివరాలు తెలుసుకున్నారు. మహారాష్ట్ర వాసిగా అనుమానం ... నాందేడ్ జిల్లా నాయేగావ్ తాలూకా కుంబర్‌గావ్ గ్రామానికి చెందిన సంతోష్‌తో తానూరు మండలం మొగ్లి గ్రామానికి చెందిన రుక్మాణి బాయితో పదేళ్ల క్రితం వివాహం జరిగింది. రుక్మిణిబాయి ఏడాది నుంచి మొగ్లి గ్రామంలోని తల్లి గారి ఇంటి వద్ద ఉంటుంది. మూడు నెలల క్రితం సంతోష్ మొగ్లికి వచ్చి స్వగ్రామానికి వెళ్లిపోయాడు. అప్పటి నుంచి సంతోష్ అచూకీ తెలియడం లేదు. దీంతో కుటుంబ సభ్యులు సంఘటన స్థలానికి చేరుకుని అస్తిపంజరాన్ని పరిశీలించారు. సంతోష్ మృతదేహం కావచ్చని అనుమానిస్తున్నారు. అస్థిపంజరాన్ని ల్యాబ్‌కు తీసుకువెళ్లి పరీక్షలు నిర్వహించాలని బాధిత కుటుంబ సభ్యలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
గుర్తుతెలియని వ్యక్తి అస్థిపంజరం లభ్యం
నర్సింహులపేట(డోర్నకల్): గుర్తు తెలియని వ్యక్తి అస్థిపంజరం లభ్యమైన సంఘటన నర్సింహులపేట మండలంలోని పెద్దనాగారం పరిధిలో వస్రాంతండా శివారు పాశంబోడు గుట్టలో శుక్రవారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రోజువారీగా గొర్రెలను మేపేందుకు గొర్రెల కాపరులు పాశంబోడు గుట్టకు వెళ్లారు. ఈ తరుణంలో కాలిపోయిన గుర్తు తెలియని అస్థి పంజరాన్ని చూశారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో మొదటగా సీఐ చేరాలు, ఎస్సై సందర్శించారు. స్థానికుల నుంచి సమాచారం సేకరించారు.. అనంతరం సంఘటనా స్థలానికి ఎస్పీ కోటిరెడ్డి, డీఎస్పీ రాజారత్నం సందర్శించారు. పరిసరాలను పరిశీలించారు. గొర్రెల కాపరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఎస్పీ కోటిరెడ్డి మాట్లాడారు. గొర్రెల కాపరులు, స్థానికుల సమాచారం మేరకు కాలిపోయిన గుర్తు తెలియని వ్యక్తి ఆనవాళ్లను గుర్తించామని తెలిపారు. వ్యక్తిని కాల్చి హత్య చేసిన ఆనవాళ్లు కనిపిస్తున్నాయన్నారు. అనుమానస్పద హత్యగా కేసు నమోదు చేశామని, కేసును వేగవంతం చేయడానికి ప్రత్యేక టీంను ఏర్పాటు చేసి నిందితులను త్వరలో పట్టుకుంటామన్నారు. తహసీల్దార్ ప్రసాదరావు, వీఆర్వో వీరసోములు, టీఆర్ఎస్ మండల శాఖ అధ్యక్షుడు టేకుల యాదగిరిరెడ్డి ఘటనా స్థలిని సందర్శించారు. -
రాచర్ల అడవిలో అస్తిపంజరం లభ్యం
వేమనపల్లి(బెల్లంపల్లి) : రాచర్ల అటవీ ప్రాంతంలో బుధవారం ఉదయం అస్తిపంజరం లభ్యమైంది. నెల రోజుల క్రితం అదృశ్యమైన ముల్కలపేట గ్రామానికి చెందిన దున్న వెంకటిదిగా కుటుంబ సభ్యులు గుర్తించారు. కుటుంబీకుల కథనం ప్రకారం వెంకటి(43) కొన్ని నెలలుగా మతి స్థిమితం లేక తిరుగుతున్నాడు. ఇంటి నుంచి వెళ్లి పోయిన నాటి నుంచి కుటుంబ సభ్యులు గాలిస్తున్నారు. ఈ నేపథ్యంలో వెంకటి రాచర్ల అటవీ ప్రాంతంలోని చెట్టుకు ఉరి పెట్టుకున్నాడు. వెంచపల్లి గ్రామానికి చెందిన పశువుల కాపరులు గమనించి కుటుంబీకులకు సమాచారం ఇచ్చారు. మృతదేహం గుర్తు పట్టలేకుండా కుళ్లి పోగా చెట్టుపై ఉన్న దుస్తులను బట్టి అతను వెంకటిగా గుర్తించారు. మృతుడి భార్య కవిత ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై భూమేశ్ తెలిపారు. మృతుడికి ఇద్దరు కూతుళ్లు సంకీర్తన, స్పందన, ఒక కుమారుడు రిత్విక్ ఉన్నారు. -
కనిపించని వ్యక్తి పుర్రె, ఎముకలు లభ్యం
భువనేశ్వర్/ఢెంకనాల్ : గత 4 నెలలుగా కనిపించకుండా పోయిన వ్యక్తి పుర్రె, ఎముకలు బుధవారం బయటపడ్డాయి. వీటి దగ్గర లభించిన పర్సు, నగదు ఆధారంగా మరణించిన వ్యక్తిని బారొకొటొ గ్రామంలోని మల్‌ఝొరొనా వీధిలో ఉంటున్న విజయ్ కొడాగా గుర్తించారు. ఆయన అన్న రౌతు కొడా కూడా గతంలో పోలీసులకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశాడు. ఢెంకనాల్ జిల్లా పర్జంగ్ పోలీస్ స్టేషన్ పరిధి అంబొపొలాస గ్రామం జీడి తోటలో యువకుడి పుర్రె, ఎముకల్ని గుర్తించారు. ఈ ప్రాంతంలో మృత యువకుని పుర్రెతో 28 ఎముకలు లభించాయి. మృతుడు తాల్చేరులో లారీ క్లీనర్‌గా పనిచేసేవాడు. డ్రైవింగ్ లైసెన్స్ కోసం రూ.11 వేలు తీసుకుని 4 నెలల కిందట ఇంటి నుంచి బయల్దేరాడు. అది మొదలుకొని విజయ్ కొడా ఆచూకీ లభించక కుటుంబీకులు అల్లాడి పోయినప్పటికీ ప్రయోజనవ లేకపోయింది. కుటుంబీకుల ఫిర్యాదు ఆధారంగా హత్య కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు స్థానిక పోలీసు వర్గాలు తెలిపాయి. పుర్రె, ఎముకల్ని స్వాధీనం చేసుకుని వైజ్ఞానిక పరీక్షల కోసం కటక్‌కు తరలించినట్లు పోలీసులు తెలిపారు. ఘటనా స్థలానికి వైజ్ఞానిక బృందం వెళ్లి వీటిని ప్రాథమికంగా పరిశీలించినట్లు పోలీసు అధికారులు తెలిపారు. -
అవ్వను కడతేర్చిందెవరు..?
సాక్షి, సిద్దిపేట : ఏడు పదుల వయస్సులో కుటుంబ సభ్యులపై ఆధారపడకుండా తన పని తాను చేసుకుంటూ అందరి నోళ్లలో నాలుకలా ఉండే సిద్దిపేట జిల్లా కొమురవెల్లి మండలం గురువన్నపేట గ్రామంలోని పండుటాకు బండారి గౌరవ్వ హత్య సంఘటన జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. అదృశ్యమైన అవ్వ మూడు నెలల తర్వాత అస్థిపంజరంగా కన్పించడంతో.. అసలు ఆమెను హత్య చేసిందెవరు..? డబ్బులు, ఆభరణాల కోసమేనా హత్య చేశారా? లేదా ఇంకేమైనా మర్మం దాగుందా.. అదే గ్రామానికి చెందిన వారే ఈ పాపానికి ఒడిగట్టారా అనేది చర్చగా మారింది. గౌరవ్వ హత్య వార్త తెలియడంతో ఆ గ్రామంలోని వారు పొద్దుకూకితే చాలు బయటకు రావడానికి సాహసించడం లేదు. మరో వైపు హత్య మిస్టరీని ఛేదించేందుకు పోలీసులు ప్రయత్నాలు ప్రారంభించారు. అదృశ్యమై.. అస్థిపంజరమై.. గురువన్నపేట గ్రామానికి చెందిన బండారి గౌరవ్వ(75) ఈ ఏడాది జనవరి 22న అదృశ్యమై ఏప్రిల్ 23న అస్థిపంజరంగా దొరికింది. గౌరవ్వ అదృశ్యమైన రోజే కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో ఏప్రిల్ 23న రాత్రి గౌరవ్వ పుర్రె, చీరను కుక్కలు బయటకు తీయడంతో హత్య విషయం వెలుగులోకి వచ్చింది. వృద్ధురాలి మృతదేహాన్ని పోలీసులు బటయకు తీయగా ఒక వైపు శరీర భాగాలు మాత్రమే ఉన్నట్లు, కాలుకు కడియం, చేతులకు కడెం, వెండి గాజులు ఆమె చేతికి ఉన్నట్లు స్థానికులు తెలిపారు. గౌరవ్వను ఇంట్లో హత్య చేసి అదే గ్రామంలోని కాముని చెరువు పక్కన తాళ్ళవాగులో చిన్నగా రెండు ఫీట్ల లోతుగా గుంతలు తీసి పాతపెట్టారు. గౌరవ్వ ఇంట్లో మెడ నుంచి తెగిపోయిన నల్లపూసలు కింద పడిన ఆనవాళ్లున్నాయి. అదే గదిలో ఉన్న చాపలో మృతదేహాన్ని వాగుకు చేర్చినట్లు ఆనవాళ్లు కనిపిస్తున్నాయి. అంటే గౌరవ్వను ఇంటి వద్దనే హత్య చేసి గుట్టుచప్పుడు కాకుండా చెరువులోకి తీసుకెళ్లి పూడ్చేశారనేది స్పష్టంగా అర్థమవుతోంది. ఒంటి నిండా ఆభరణాలు? గౌరవ్వ మెడలో నాలుగు తులాల బంగారు గుండ్లు, ఏనెలు, గెంటీలు ఉండగా సుమారు కిలో వెండి ఆభరణాలు ధరించి ఉంది. అదేవిధంగా ఆమె ఇంట్లో రూ. 30వేల నగదు ఉందని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. బంగారు, వెండి ఆభరణాలకు తోడు నగదు అపహరించడం కోసం ఆమెను హత్య చేసి ఉంటారని స్థానికులు భావిస్తున్నారు. అయితే ఆభరణాలకోసమే హత్య చేస్తే ఆమె కా లుకు కడియాలు, చేతికి ఉన్న గాజులను ఎం దుకు తీసుకెళ్లలేదనేది ప్రశ్నార్థకంగా మారింది. శవాన్ని ఇంటి నుంచి తీసుకెళ్లిన దొంగలు మిగిలిన ఆభరణాలు ఎందుకు తీసుకోలేదనే కోణంలో కూడా ఆలోచించాల్సి ఉంటుంది. అదను చూసి హత్య.. గౌరవ్వను అదను చూసి హత్య చేసినట్లు స్థానికులు చెబుతున్నారు. జనవరిలో కొమురవెల్లి జాతరకు భక్తులు అధిక సంఖ్యలో వస్తారు. అక్కడి నుంచి కొండపోచమ్మ దేవాలయానికి వచ్చి వెళ్తుంటారు. గౌరవ్వ ఇంటి పరిసర ప్రాంతంలో గౌడ, కుమ్మరి, గొల్ల కులస్తులు ఉంటారు. ఈ మూడు కులాల వారికి జాతర సందర్భంగా కల్లు, కుండలు అమ్మడంతోపాటు గొల్ల కులస్తులు డోలు కొట్టేందుకు వెళ్తారు. ఇంటిలో పసిపిల్లలు, వృద్ధులు మాత్రమే ఉంటారు. ఈ సమయం అనుకూలమైనదిగా భావించి గౌరవ్మను ఇంటిలోనే హత్య చేసి గుట్టుచప్పుడు కాకుండా మృతదేహాన్ని బయటకు తీసుకెళ్లి ఉండవచ్చని స్థానికులు చెబుతున్నారు. అయితే గౌరవ్వ వద్ద బంగారం, వెండి ఆభరణాలతోపాటు రూ.30వేల నగదు ఉందనే విషయం స్థానికులు, గౌరవ్వతో మంచి సంబం ధాలు ఉన్న వారికి మాత్రమే తెలిసే అవకాశం ఉంది. గౌరవ్వను హత్యకు తెలిసిన వారే పాల్ప డి ఉంటారని కూడా ప్రచారం జరుగుతోంది. ఆ మెను హత్య చేసిన వారిని కఠినంగా శిక్షిం చాలని కుటుంబీకులు పోలీసులను కోరుతున్నారు. గ్రామంలో ఇదే మొదటి సంఘటన కావడంతో గ్రామస్తులు భయాందోళనకు గురవుతున్నారు. వేలాది మంది భక్తులు వస్తూ ఉండే కొండపోచమ్మ దేవాల యం సమీపంలో వెలుగు చూసిన హత్య సంఘటన ఛేదించడం జిల్లా పోలీసులకు కూడా ఛాలెంజ్‌గా మారింది. జిల్లాకు కొత్త పోలీస్ బా స్ వచ్చిన తర్వాత తొలి కేసు ఇదే కావడంతో ఆ యన ఈ విషయంపై సీరియస్‌గా ఉన్నట్లు తెలి సింది. ఈ నేపథ్యంలో గౌరవ్వ హత్య సంఘటన పోలీసులు ఎప్పుడు ఛేదిస్తారో వేచి చూడాలి. హత్య కేసులో నిందితులెవరనేది ఉత్కంఠగా మారింది. విచారణ చేపడుతున్నాం.. గౌరవ్వ హత్యపై విచారణ చేపడుతున్నాం. ప్రస్తుతం కొంత మందిని విచారించాం. గౌరవ్వ మృతి చెందడంతో ఆమె కుటుంబ సభ్యులు ఫార్మాలిటీస్ పూర్తి చేస్తున్నారు. త్వరలో పూర్తి సమాచారం సేకరిస్తాం. ఇప్పటికే అనేక కోణాల్లో కేసును విచారిస్తున్నాం. – సత్తీష్, ఎస్ఐ, కొమురవెల్లి -
అదృశ్యమై.. అస్థిపంజరంగా.
కొమురవెల్లి(సిద్దిపేట): మూడు నెలల క్రితం గురువన్నపేటలో అదృశ్యమైన వృద్ధురాలి అస్థిపంజరం లభ్యమైన ఘటన సోమవారం రాత్రి వెలుగులోకి వచ్చింది. గురువన్నపేటకు చెందిన బండారు గౌరవ్వ(75) జనవరి 22న అదృశ్యమైన సంగతి మనకు తెలిసిందే. కాగా, జనవరి 24న కుటుంబ సభ్యులు కొమురవెల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. సోమవారం గురువన్నపేట వాగులో ఓ గొర్రెల కాపరికి మనిషి పుర్రె కనిపించింది. దీంతో ఈ విషయాన్ని ఇరుగుపొరుగుకు తెలియజేయడంతో పాటు పోలీసులకు సమాచారం అందించారు. చేర్యాల సీఐ రఘు, కొమురవెల్లి ఎస్ఐ సతీశ్‌కుమార్‌తో పాటు గౌరవ్వ కుటుంబ సభ్యులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. కాగా, చీర, కొన్ని వస్తువుల ఆధారంగా అస్థిపంజరం గౌరవ్వదిగా ఆమె కుటుంబ సభ్యులు గుర్తించారు. వృద్ధురాలికి ముగ్గురు కుమార్తెలు, ఇద్దరు కుమారులు ఉన్నారు. -
నయీం కేసులో అస్థిపంజరం గుర్తింపు
హైదరాబాద్ : గ్యాంగ్‌స్టర్ నయీం కేసు దర్యాప్తులో అనేక సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా నార్సింగి మంచిరేవులలో ఓ అస్థిపంజరాన్ని పోలీసులు గుర్తించారు. సిట్ అదుపులో ఉన్న నయీం అనుచరులు ఇచ్చిన సమాచారంతో అస్థిపంజరాన్ని రంగారెడ్డి జిల్లా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆ అస్థిపంజరం మూడేళ్ల క్రితం నయీం చంపిన 17 ఏళ్ల పని అమ్మాయిదిగా తెలుస్తోంది. ఈ అస్థిపంజరం ఎవరదనేదిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. మరోవైపు నయీం కేసు ప్రాథమిక దర్యాప్తు మరో మూడు రోజుల్లో పూర్తికానుంది. ఇప్పటి వరకు ఈ కేసులో 33 మంది నయీం అనుచరులను అరెస్ట్ చేయగా, రూ.143 కోట్ల విలువైన నయీం ఆస్తులను సీజ్ చేసినట్లు అధికారులు తెలిపారు.