నయీం కేసులో అస్థిపంజరం గుర్తింపు | Skeleton find out in ranga reddy district over nayeem case enquiry | Sakshi
Sakshi News home page

నయీం కేసులో అస్థిపంజరం గుర్తింపు

Published Mon, Aug 22 2016 6:09 PM | Last Updated on Tue, Oct 16 2018 9:08 PM

నయీం కేసులో అస్థిపంజరం గుర్తింపు - Sakshi

నయీం కేసులో అస్థిపంజరం గుర్తింపు

గ్యాంగ్స్టర్ నయీం కేసు దర్యాప్తులో అనేక సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.

హైదరాబాద్ : గ్యాంగ్స్టర్ నయీం కేసు దర్యాప్తులో అనేక సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా నార్సింగి మంచిరేవులలో ఓ అస్థిపంజరాన్ని పోలీసులు గుర్తించారు. సిట్ అదుపులో ఉన్న నయీం అనుచరులు ఇచ్చిన సమాచారంతో అస్థిపంజరాన్ని రంగారెడ్డి జిల్లా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆ అస్థిపంజరం మూడేళ్ల క్రితం నయీం చంపిన 17 ఏళ్ల పని అమ్మాయిదిగా తెలుస్తోంది. ఈ అస్థిపంజరం ఎవరదనేదిపై పోలీసులు ఆరా తీస్తున్నారు.    
 
మరోవైపు నయీం కేసు ప్రాథమిక దర్యాప్తు మరో మూడు రోజుల్లో పూర్తికానుంది. ఇప్పటి వరకు ఈ కేసులో 33 మంది నయీం అనుచరులను అరెస్ట్ చేయగా, రూ.143 కోట్ల విలువైన నయీం ఆస్తులను సీజ్ చేసినట్లు అధికారులు తెలిపారు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement