ఘటన స్థలం వద్ద స్థానికులతో మాట్లాడుతున్న ఎస్పీ కోటిరెడ్డి
నర్సింహులపేట(డోర్నకల్): గుర్తు తెలియని వ్యక్తి అస్థిపంజరం లభ్యమైన సంఘటన నర్సింహులపేట మండలంలోని పెద్దనాగారం పరిధిలో వస్రాంతండా శివారు పాశంబోడు గుట్టలో శుక్రవారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రోజువారీగా గొర్రెలను మేపేందుకు గొర్రెల కాపరులు పాశంబోడు గుట్టకు వెళ్లారు. ఈ తరుణంలో కాలిపోయిన గుర్తు తెలియని అస్థి పంజరాన్ని చూశారు.
వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో మొదటగా సీఐ చేరాలు, ఎస్సై సందర్శించారు. స్థానికుల నుంచి సమాచారం సేకరించారు.. అనంతరం సంఘటనా స్థలానికి ఎస్పీ కోటిరెడ్డి, డీఎస్పీ రాజారత్నం సందర్శించారు. పరిసరాలను పరిశీలించారు. గొర్రెల కాపరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఎస్పీ కోటిరెడ్డి మాట్లాడారు. గొర్రెల కాపరులు, స్థానికుల సమాచారం మేరకు కాలిపోయిన గుర్తు తెలియని వ్యక్తి ఆనవాళ్లను గుర్తించామని తెలిపారు.
వ్యక్తిని కాల్చి హత్య చేసిన ఆనవాళ్లు కనిపిస్తున్నాయన్నారు. అనుమానస్పద హత్యగా కేసు నమోదు చేశామని, కేసును వేగవంతం చేయడానికి ప్రత్యేక టీంను ఏర్పాటు చేసి నిందితులను త్వరలో పట్టుకుంటామన్నారు. తహసీల్దార్ ప్రసాదరావు, వీఆర్వో వీరసోములు, టీఆర్‌ఎస్ మండల శాఖ అధ్యక్షుడు టేకుల యాదగిరిరెడ్డి ఘటనా స్థలిని సందర్శించారు.
Comments
Please login to add a commentAdd a comment