ఓ మతిస్థిమితం లేని బాలికపై దుండగులు పైశాచికత్వానికి పాల్పడ్డారు.
యాలాల (రంగారెడ్డి) : ఓ మతిస్థిమితం లేని బాలికపై దుండగులు పైశాచికత్వానికి పాల్పడ్డారు. ఆమెకు మాయ మాటలు చెప్పి నిర్జన ప్రదేశానికి తీసుకెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డారు. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా యాలాల మండలంలో శుక్రవారం వెలుగులోకి వచ్చింది. మండలంలోని అచ్యుతాపురం నివాసి అయిన ఓ బాలికపై ముగ్గురు వ్యక్తులు అత్యాచారానికి పాల్పడినట్లు బాలిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు విచారణ ప్రారంభించారు.