‘మతి’లేకున్నా.. మంచోడు..!  | Mentally Challenged Person Helped To The Old Persons | Sakshi
Sakshi News home page

‘మతి’లేకున్నా.. మంచోడు..! 

Published Sat, Jul 28 2018 11:16 AM | Last Updated on Tue, Oct 16 2018 4:50 PM

Mentally Challenged Person Helped To The Old Persons - Sakshi

వృద్ధులను రోడ్డు దాటిస్తున్న యాండో   

కూసుమంచి ఖమ్మం జిల్లా : ఇతడు ఇక్కడి వారందరికీ సుపరిచితుడు. అందరూ యాండో (పిచ్చోడు) అని పిలుస్తుంటారు. ఈ ఫొటో చూశారా...? ఇద్దరు వృద్ధుల చేతులు పట్టుకుని రోడ్డు దాటిస్తున్నాడు. అక్కడ ఇంకెంతోమంది ‘మంచి’మనుషులు ఉన్నారు. వారెవరూ ఇతడిలా సాయపడేందుకు ముందుకు రాలేదు.

ఇప్పుడు చెప్పండి... ఇతడిని పిచ్చోడా...? పిచ్చోడిలా కనిపిస్తున్న మంచోడా...?! ఈ దృశ్యం ఖమ్మం–సూర్యాపేట రాష్ట్రీయ రహదారిలోని కూసుమంచి బస్టాండ్‌ సెంటర్‌లో కనిపించింది. ఈ రోడ్డు దాటాలంటే చాలా మంది ఇబ్బంది పడుతుంటారు. ఇక వృద్ధుల సంగతి చెప్పనక్కరలేదు. అలాంటి రద్దీగా ఉండే రోడ్డుపై శనివారం ఇద్దరు వృద్ధులను రోడ్డు దాటించి మానవత్వాన్ని చాటుకున్నాడు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement