11ఏళ్ల తర్వాత సొంత గూటికి.. | 11 years after to own house | Sakshi
Sakshi News home page

11ఏళ్ల తర్వాత సొంత గూటికి..

Published Mon, Jun 6 2016 12:52 AM | Last Updated on Tue, Oct 16 2018 4:50 PM

11ఏళ్ల తర్వాత సొంత గూటికి.. - Sakshi

11ఏళ్ల తర్వాత సొంత గూటికి..

తిరిగి ఇంటికి చేరిన మతిస్థిమితం లేని వ్యక్తి
 
 చౌటుప్పల్: మతిస్థిమితం కోల్పోయి ఇంటి నుంచి బయటికెళ్లిన ఓ వ్యక్తి 11ఏళ్లకు మళ్లీ సొంత గూటికి చేరాడు. మహబూబ్‌నగర్ జిల్లా కేశంపేట మండలం ఇప్పలపల్లికి చెందిన మాసారం రామచంద్రయ్య మతిస్థిమితం కోల్పోయి ఇంటి నుంచి వెళ్లిపోయాడు. నల్లగొండలో 2011లో జరిగిన పునర్జన్మ కార్యక్రమంలో భాగంగా పోలీసులు ఈయనను అమ్మానాన్న అనాథాశ్రమం నిర్వాహకులకు అప్పగించారు.

ఆశ్రమ నిర్వాహకులు ఐదేళ్లుగా ఎర్రగడ్డలో చికిత్స చేయించారు. కోలుకున్న రామచంద్రయ్య తన చిరునామా చెప్పడంతో కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. ఆదివారం నల్లగొండ జిల్లా చౌటుప్పల్ పోలీస్ స్టేషన్‌లో ఏఎస్‌ఐ ఖాజా సమక్షంలో రామచంద్రయ్యను భార్య కాళమ్మ, తల్లి జంగమ్మలకు అప్పగించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement