కుమార్తెపైనే తండ్రి లైంగిక వేధింపులు? | father committed sexual harrassment | Sakshi
Sakshi News home page

కుమార్తెపైనే తండ్రి లైంగిక వేధింపులు?

Published Thu, Mar 12 2015 10:34 PM | Last Updated on Tue, Oct 16 2018 4:50 PM

father committed sexual harrassment

టీనగర్ (చెన్నై): తన తండ్రి లైంగికంగా వేధించి, నిర్బంధించినట్లు ఓ మహిళా డాక్టర్ మహిళా పోలీసులకు గురువారం ఫిర్యాదు చేసింది. తమిళనాడులోని తూత్తుకుడికి చెందిన లూర్థురాజ్ చెన్నైలో కెమికల్ వ్యాపారం చేస్తున్నారు. ఇతనికి భార్య వసంత ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె వున్నారు. ప్రస్తుతం వీరు చెన్నై ఎర్నావూరు రామకృష్ణానగర్‌లో నివసిస్తున్నారు. కుమార్తె నందిని చెన్నైలో ప్రైవేటు దంత వైద్యురాలిగా పని చే స్తున్నారు. నందినికి మానసిక స్థితి సరిలేదని చెప్పి ఆమె తండ్రి, బంధువులు పాళయంకోట్టైలోని మానసిక వికలాంగుల కేంద్రంలో నిర్బంధించారు. అక్కడికి నందినితో పనిచేసిన డాక్టర్, స్నేహితురాళ్లు వచ్చారు. దీంతో నందిని వారికి జరిగిన సంఘటన గురించి తెలుపగా వారు నందినితో మహిళా పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశారు. అంతలోనే హోం నుంచి నందినిని కిడ్నాప్ చేసినట్లు హోం నిర్వాహకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు అక్కడికి వెళ్లి విచారణ జరిపారు. పోలీసుల విచారణలో అనేక వివరాలు వెలుగు చూశాయి. నందిని మానసిక రోగి కాదని, చదువుతున్న సమయంలో యూనివర్సిటీ గోల్డ్ మెడల్ సాధించిందని, తండ్రి లూర్థురాజ్ కుమార్తెను లైంగికంగా వేధించడంతో, ఆమె 15 రోజుల క్రితం నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యకు యత్నించినట్లు తెలిసింది. వెంటనే ఆమెను పాళయంకోట్టైలోగల ఒక ప్రైవేటు ఆస్పత్రికి తరలించి, అక్కడ నుంచి పాళయంకోట్టైలో గల మానసిక వికలాంగుల కేంద్రంలో నిర్బంధించారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి లూర్థురాజ్‌తోపాటు అతనికి సహకరించిన వారి కోసం గాలిస్తున్నారు.
తండ్రిపై అభాండాలు: తల్లి వసంత
వివాహమైన డాక్టర్‌తో నందినికి సంబంధం వున్నందున దీనిని దారి మళ్లించేందుకే తండ్రిపై అభాండాలు వేస్తున్నట్లు నందిని తల్లి వసంత ఆరోపించారు. చెన్నైకు చెందిన డాక్టర్ దినేష్ తన మొదటి భార్య వుండగానే ఆస్పత్రిలో పనిచేస్తున్న మరొక మహిళా డాక్టర్‌ను వివాహం చేసుకునేందుకు ప్రయత్నించగా, పోలీసులు వివాహాన్ని అడ్డుకున్నారని చెప్పారు. ప్రస్తుతం అతను తన కుమార్తెను లొంగదీసుకున్నాడని, అతడి ప్రేమ మోహంలో ఉన్న నందిని తన తండ్రిపైనే అభాండాలు వే స్తోందని వసంత తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement