కరీంనగర్: కరీంనగర్ జిల్లా జగిత్యాల కొత్త బస్టాండ్ పరిసర ప్రాంతాల్లో శనివారం మతిస్థిమితం లేని వ్యక్తి హల్చల్ సృష్టించాడు. బస్టాండ్ సమీపంలోని కొంతమంది వ్యక్తులపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచాడు. అనంతరం అక్కడే ఉన్న పలు వాహనాలను ధ్వంసం చేశాడు. దాంతో అతడిని పట్టుకునేందుకు స్థానికులు యత్నించి విఫలమయ్యారు. దీంతో పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు కొత్త బస్టాండ్ వద్దకు చేరుకుని అతి కష్టం మీద అతడిని ఆదుపులోకి తీసుకున్నారు. అనంతరం మతిస్థిమితం లేని వ్యక్తిని పోలీసు స్టేషన్కు తరలించారు.