
ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, కోరుట్ల(జగిత్యాల): ప్రజలను ఆరోగ్యంవంతులను చేసి కాపాడాల్సిన డాక్టరే సాటి నర్సుపట్ల కామాంధుడిగా వ్యవహరించాడు. ఆమెను లైంగికంగా వేధించాడు. ఈ ఘటన, స్థానిక శ్రీలక్ష్మీ ఆసుపత్రిలో చోటుచేసుకుంది. కాగా, సదరు వైద్యుడు అదే ఆసుపత్రిలో పనిచేస్తున్న నర్సును లైంగికంగా వేధించినందుకు బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై సతీష్ తెలిపారు.
ఆసుపత్రి వైద్యుడు రాజేశ్ తనను లైంగికంగా వేధిస్తూ ఇబ్బందులకు గురిచేస్తున్నాడని సోమవారం బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. వైద్యుడు రాజేశ్ లైంగిక వేధింపుల చట్టంతోపాటు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కింద కేసు నమోదు చేసినట్లు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment