మైనర్ బాలికపై వృద్ధుడు లైంగిక దాడి | rape incedent on a mentally challenged girl | Sakshi
Sakshi News home page

మైనర్ బాలికపై వృద్ధుడు లైంగిక దాడి

Published Sat, Feb 28 2015 2:50 PM | Last Updated on Tue, Oct 16 2018 4:50 PM

rape incedent on a mentally challenged girl

సఖినేటిపల్లి (తూర్పుగోదావరి) : మానసిక పరిపక్వతలేని మైనర్ బాలికపై ఐదు నెలలుగా లైంగిక దాడికి పాల్పడిన  వృద్ధున్ని పోలీసులు శనివారం అదుపులో తీసుకున్న సంఘటన తూర్పుగోదావరి జిల్లా సఖినేటిపల్లి మండలం రామేశ్వరంలో జరిగింది.  వివరాలు.... రామేశ్వరం గ్రామానికి చెందిన ఓ వ్యవసాయ కూలీకి మానసిక పరిపక్వత లేని ఒక కుమార్తె, ఒక కుమారుడు ఉన్నారు. ఆయన భార్య ఇటీవలే చనిపోయింది. తండ్రీ కొడుకులు వ్యవసాయ పనులకు వెళుతుండగా మైనర్ బాలిక ఒంటిరిగా ఇంట్లోనే ఉంటోంది.

అదే గ్రామానికి చెందిన నారదాసు రాము(50)  బాలికను మాయమాటలతో లోబరుచుకుని సుమారు ఐదు నెలలుగా లైంగికదాడికి పాల్పడుతున్నాడు. కుటుంబ సభ్యులకు అనుమానం వచ్చి ఆరా తీయగా విషయం బయటపడింది. బాలిక తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు.  పోలీసులు నిందితున్ని అదుపులోకి తీసుకున్నారు. బాలికను వైద్య పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి  తరలించి వైద్య పరీక్షలు చేయించగా ఆమె గర్భవతని డాక్టర్లు ధ్రువీకరించారు. నిందితున్ని కఠినంగా శిక్షించి న్యాయం చేయాలని బాధితులు డిమాండ్ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement