వరంగల్: వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం రోళ్లకల్లు గ్రామంలో మానసిక వికలాంగురాలిపై రామ్‌చందర్ అనే వ్యక్తి కొన్ని నెలలుగా అత్యాచారానికి పాల్పడుతున్నాడు. ఆమె గర్భం దాల్చటంతో అబార్షన్ చేయించాడు. అది వికటించి బాధితురాలి పరిస్థితి విషమంగా మారటంతో కుటుంబసభ్యులు వరంగల్ ఎంజీఎంకు తరలించారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. నిందితుడిపై నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేసి, అదుపులోకి తీసుకున్నారు.