నల్లగొండ జిల్లా మిర్యాలగూడ మండల కేంద్రంలో ఓ మతిస్థిమితం లేని బాలికపై ముగ్గురు దుండగులు అత్యాచారానికి పాల్పడ్డారు.
మిర్యాలగూడ(నల్లగొండ): నల్లగొండ జిల్లా మిర్యాలగూడ మండల కేంద్రంలో ఓ మతిస్థిమితం లేని బాలికపై ముగ్గురు దుండగులు అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ విషయం సోమవారం వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనపై కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదుచేసిన పోలీసులు దుండగుల ఆచూకి కోసం గాలిస్తున్నారు. గుట్టపల్లికి చెందిన బాలిక పదిహేను రోజుల కిందట మిర్యాలగూడకు రాగా ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారని కుటుంబ సభ్యులు ఫిర్యాదులో పేర్కొన్నారు.