వరంగల్ (నర్మెట్ట) : మానసిక వికలాంగురాలిపై అత్యాచారం జరిగిన ఘటన చాలా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల ప్రకారం.. నర్మెట్ట మండలం బొత్తలపర్రి గ్రామానికి చెందిన ఓ యువతికి ఈ నెల 8 వ తేదీన కడుపు నొప్పి రావటంతో తల్లిదండ్రులు స్థానిక ఆర్‌ఎంపీ దగ్గరకు తీసుకెళ్లారు. పరీక్షించిన ఆర్‌ఎంపీ ఆమె 6 నెలల గర్భవతి అని తేల్చాడు. నమ్మలేని ఆ తల్లిదండ్రులు ఆర్‌ఎంపీ డాక్టర్కేమీ తెలియదులే అని ఊరుకున్నారు. ఎందుకైనా మంచిదని ఆ మరుసటి రోజు పెద్దాసుపత్రికి తీసుకెళ్లి మళ్లీ పరీక్షలు చేయించారు. వారు కూడా మీ అమ్మాయి గర్భవతి అని చెప్పడంతో తల్లిదండ్రులు నివ్వెరపోయారు.
ఈ విషయం గురించి ఆరా తీయగా గ్రామానికి చెందిన ముడికె సంజీవ అనే వ్యక్తి ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు తెలిసింది. మానసిక వికలాంగురాలు కావడంతో ఆ యువతికి జరిగిన విషయం ఇన్ని రోజులూ తెలియలేదు. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు గురువారం పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నాడు. నిందితుడు సంజీవ పరారీలో ఉన్నాడు.
మానసిక వికలాంగురాలిపై అత్యాచారం
Published Thu, Aug 13 2015 7:26 PM | Last Updated on Tue, Oct 16 2018 4:50 PM
Advertisement
Advertisement