మతిస్థిమితంలేని యువతి ఆత్మహత్య | mentally challenged woman commits suicide | Sakshi
Sakshi News home page

మతిస్థిమితంలేని యువతి ఆత్మహత్య

Published Thu, May 7 2015 2:45 PM | Last Updated on Tue, Nov 6 2018 7:56 PM

mentally challenged woman commits suicide

పుట్టపర్తి (అనంతపురం జిల్లా): మతిస్థిమితంలేని ఒక యువతి ప్రమాదవశాత్తు ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకొని ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన గురువారం అనంతపురం జిల్లా పుట్టపర్తి మండలం కప్పలబండ గ్రామంలో జరిగింది. వివరాల ప్రకారం..కప్పలబండ గ్రామానికి చెందిన చిన నర్సింహుడు, వెంకటమ్మ దంపతుల కుమార్తె సాయిలీల(22) చిన్నతనంలోనే మతిస్థిమితం కోల్పోయింది. కాగా గురువారం గ్రామంలో తన ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుంది. ఈ క్రమంలోనే బాధను తట్టుకోలేక పరుగులు తీసి పక్కనే ఉన్న పాకలోకి వెళ్లింది. దీంతో పాకకు నిప్పంటుకుంది. విషయం తెలిసిన అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపుచేశారు. కానీ ఆ యువతి మంటల్లోనే మృతిచెందింది. పోలీసులు మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement