తిరుమలలో మతిస్థిమితం లేని వ్యక్తి హల్‌చల్
Published Sat, Aug 12 2017 2:37 PM | Last Updated on Tue, Oct 16 2018 4:50 PM
తిరుమల: తిరుమలలో మతిస్థిమితం లేని ఓ వ్యక్తి హల్‌చల్ చేశాడు. పీయస్సీ-4 వద్ద ఓ మహిళపై మతిస్థిమితం లేని వ్యక్తి కర్రతో దాడి చేశాడు. ఈ దాడిలో మహిళలకు తీవ్ర గాయాలు కావడంతో స్థానిక ఆస్పత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న విజిలెన్స్ అధికారులు ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు.
ఇదిలా ఉంగా.. తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. ఏడుకొండల వాడి సన్నిధిలో సుమారు 200 పైగా వివాహాలు జరగనున్నాయి. కొత్త జంటలతో తిరుమల కొండ కళకళలాడుతోంది. ప్రస్తుతం శ్రీవారి సర్వదర్శనానికి 15 గంటల సమయం పడుతోంది. వరుస సెలవులు కావడంతో భారీగా భక్తులు తరలివస్తున్నారు. నారాయణగిరి ఉద్యానవనం ప్రాంతంలో కాలిబాటన కొండపైకి వచ్చిన వారు స్వామివారి దర్శనం కోసం పడిగాపులు కాస్తున్నారు. గదుల సమస్యతో భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
Advertisement
Advertisement