కనుబొమలు క్యారెక్టర్‌ని చెప్తాయా?!
మనిషిని చూడగానే వారి మనస్తత్వం తెలిసిపోతుందా? తెలియదనే అంటారు ఎవరైనా. కానీ ప్రముఖ ఫెంగ్‌షు నిపుణురాలు ప్రియా షేర్ మాత్రం తనకు తెలుస్తుంది అంటోంది. మీరు కూడా తెలుసుకోవచ్చు అని చెబుతోంది. కనుబొమలు మనిషి మనసుకు అద్దం పడతాయట. కాబట్టి వాటిని చూసి ఎవరేంటో తెలుసుకోండి అంటోంది. అదెలాగంటే...
చివర్లు వంపు తిరిగి ఉండే కనుబొమలు కలవారు సృజనాత్మకత కలవారై ఉంటారట తిన్నగా గీత గీసినట్టుగా ఉండే కనుబొమలు ఉన్నవారు దృఢచిత్తం కలవారై ఉంటారట. ఒకవేళ మహిళలైతే వారిలో కాస్త పురుషత్వం కనిపిస్తూ ఉంటుందట ఇంద్రధనుసులా వంగివుండే కనుబొమలు కల పురుషులు సెన్సెటివ్‌గా... మహిళలైతే మొండిగా ఉంటారట గుబురు కనుబొమలు కల మహిళల నడక, బాడీ లాంగ్వేజ్‌లో కొద్దిగా పురుష లక్షణాలు కనిపిస్తుంటాయట. అదే పురుషులైతే యమా ఉత్సాహంగా ఉంటారట సన్నని గీతలా ఉండే కనుబొమలు కలవారు చాలా మృదుస్వభావులై ఉంటారట కన్నులకు మరీ దూరంగా, పైన ఎక్కడో ఉన్నట్టుగా కనుబొమలు ఉంటే... వారికి కలలు, కోరికలు ఎక్కువుంటాయట. అదే కనుబొమలు కన్నులకు చాలా దగ్గరగా ఉంటే... వారిలో నిబద్ధత, ప్రతి పని పట్ల శ్రద్ధ కనిపిస్తుందట. అలాగే వీరు పరమ జాగ్రత్తపరులట. కొన్నిసార్లు తమ పనిలో పడి ఇతరులను కూడా పట్టించుకోరట కనుబొమలు నల్లగా కాకుండా బ్రౌన్ కలర్లో ఉంటే... వారిలో శృంగార భావనలు అధికంగా ఉంటాయట.
అదే కనుబొమలు మెత్తగా లేకుండా రఫ్‌గా ఉంటే... అటువంటి భావనలు తక్కువగా ఉంటాయట కంటికీ కనుబొమకీ మధ్య ఉండే దూరం ఒక్కోసారి రెండు కన్నులకూ వేరుగా ఉంటుంది. దాన్ని బట్టి, స్త్రీ పురుషుల్లో ఎవరు డామినేటింగో చెప్పవచ్చట. ఆడవారి కుడి కనుబొమ కనుక ఎడమ కనుబొమకంటే పైకి ఉంటే... వారిలో ఆధిక్యధోరణి ఎక్కువట. అదే పురుషుల్లో అయితే ఎడమ కనుబొమను పరిగణనలోకి తీసుకోవాలట.అదీ కనుబొమల కథ. ఇంకెందుకు లేటు?! ఎవరి గురించి తెలుసుకోవాలన్నా ఈసారి ఈ థియరీని ఫాలో అయ్యి చూడండి.