
బెర్లిన్: స్పెషల్ ఒలింపిక్స్ వరల్డ్ గేమ్స్‌ను భారత జట్టు ఏకంగా 202 పతకాలతో ముగించింది. ఇందులో 76 స్వర్ణ పతకాలు, 75 రజత పతకాలు, 51 కాంస్య పతకాలు ఉన్నాయి. బుద్ధి మాంద్యంతో బాధపడుతున్న వారికి ప్రోత్సహించేందుకు స్పెషల్ ఒలింపిక్స్ పేరిట క్రీడలు నిర్వహిస్తారు.
ఓవరాల్‌గా భారత్ నుంచి 198 మంది క్రీడాకారులు బరిలోకి దిగారు. ఆంధ్రప్రదేశ్ నుంచి గుజ్జల అలివేలమ్మ మహిళల టేబుల్ టెన్నిస్ డి–3 కేటగిరీ సింగిల్స్‌లో, డి02 డబుల్స్‌లో స్వర్ణ పతకాలు నెగ్గింది. బ్యాడ్మింటన్ సింగిల్స్ డబ్ల్యూ–7 కేటగిరీలో దూదేకుల షమీలా కాంస్య పతకం సాధించింది.