Special Olympics World Games
-
ఒలింపిక్స్ వరల్డ్ గేమ్స్‌లో భారత్‌కు పతకాల పంట.. ఏకంగా 202 మెడల్స్
బెర్లిన్: స్పెషల్ ఒలింపిక్స్ వరల్డ్ గేమ్స్‌ను భారత జట్టు ఏకంగా 202 పతకాలతో ముగించింది. ఇందులో 76 స్వర్ణ పతకాలు, 75 రజత పతకాలు, 51 కాంస్య పతకాలు ఉన్నాయి. బుద్ధి మాంద్యంతో బాధపడుతున్న వారికి ప్రోత్సహించేందుకు స్పెషల్ ఒలింపిక్స్ పేరిట క్రీడలు నిర్వహిస్తారు. ఓవరాల్‌గా భారత్ నుంచి 198 మంది క్రీడాకారులు బరిలోకి దిగారు. ఆంధ్రప్రదేశ్ నుంచి గుజ్జల అలివేలమ్మ మహిళల టేబుల్ టెన్నిస్ డి–3 కేటగిరీ సింగిల్స్‌లో, డి02 డబుల్స్‌లో స్వర్ణ పతకాలు నెగ్గింది. బ్యాడ్మింటన్ సింగిల్స్ డబ్ల్యూ–7 కేటగిరీలో దూదేకుల షమీలా కాంస్య పతకం సాధించింది. -
స్పెషల్ ఒలింపిక్స్ గేమ్స్: సోనూ సూద్‌కు అరుదైన గౌరవం
సాక్షి,ముంబై: రియల్ హీరో, బాలీవుడ్ నటుడు సోనూ సూద్ కు అరుదైన గౌరవం దక్కింది. వచ్చే ఏడాది రష్యాలో జరిగే స్పెషల్ ఒలింపిక్స్ లో భాగంగా భారత్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా ఎంపికయ్యారు. దీనిపై సోనూ సంతోషం వ్యక్తం చేశారు. ఈ రోజు తనకు చాలా ప్రత్యేకమైన రోజని, స్పెషల్ ఒలింపిక్స్ భారత్ బృందంతో చేరడం తనకు గర్వంగా ఉందన్నారు. ఈ సందర్బంగా ఎస్వో భారత్ జట్టుకు ముందస్తు అభినందనలు తెలుపుతూ ట్వీట్ చేశారు. రష్యాలోని కజాన్ వేదికగా వచ్చే ఏడాది జనవరి 22 నుంచి స్పెషల్ వింటర్ ఒలింపిక్స్ జరుగనున్నాయి. ఈ వింటర్ ఒలింపిక్స్‌కు హాజరయ్యే భారతదేశం అథ్లెట్ల బృందానికి సోనూ నాయకత్వం వహించ నున్నారు. అటు ఈ పరిణామంపై ప్రత్యేక ఒలింపిక్స్ భారత్ ఛైర్పర్సన్ డాక్టర్ మల్లికా నడ్డా సంతోషం ప్రకటించారు. ప్రత్యేక ఒలింపిక్స్ కుటుంబంలో చేరేందుకు తమ ఆహ్వానాన్ని మన్నించిన సోనూ సూద్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ విషయంలో ఆయన కీలక పాత్ర పోషించనున్నాడని నమ్ముతున్నామన్నారు. కాగా కరోనా మహమ్మారి లాక్డౌన్ సంక్షోభంలో వలస కూలీలకు అండగా నిలిచిన సోనూ సూద్ రియల్ హీరోగా అవతరించారు. ఇక అప్పటినుంచి విద్యార్థులకు అండగా ఉంటూ వచ్చిన ఆయన తన సేవలను కొనసాగిస్తూనే ఉన్నారు. ముఖ్యంగా సెకండ్ వేవ్‌లో అనేకమంది బాధితులకు అండగా నిలిచారు. Feeling proud today as I'm chosen to be the Brand Ambassador for India at the #SpecialOlympics going to be held in Russia! I'm sure our champions will make us proud and I wish them all the best! Jai Hind 🇮🇳🇮🇳🇮🇳 pic.twitter.com/9MxfE3UDSP — sonu sood (@SonuSood) August 2, 2021 -
సరికొత్త చరిత్ర సృష్టించిన రణ్ వీర్ సింగ్
లాస్ ఎంజెల్స్: రణ్వీర్ సింగ్ సైని భారత్ తరఫున సరికొత్త చరిత్ర సృష్టించాడు. స్పెషల్ ఒలంపిక్స్ వరల్డ్ గేమ్స్‌లో స్వర్ణం సాధించి భారత్ తరఫున ఈ ఘన సాధించిన తొలి ఆటగాడిగా నిలిచాడు. లాస్ ఎంజిల్స్‌లో శుక్రవారం జరిగిన ఈ గేమ్‌లో 14 ఏళ్ల గోల్ఫర్ సైనీ తన భాగస్వామి మోనికా జగూతో కలిసి ఈ అరుదైన ఫీట్ సాధించాడు. గుర్గావ్కు చెందిన రణ్వీర్ సైని ఆటిజంతో సతమతమవుతున్నాడు. రెండేళ్ల వయసు నుంచి నరాల సంబంధిత వ్యాధితో పోరాడుతున్న సైని తొమ్మిదేళ్ల ప్రాయంలో గోల్ఫ్ ఆడటం ప్రారంభించాడు. ఆసియా పసిఫిక్ వరల్డ్ గేమ్స్‌లో రెండు స్వర్ణాలు గెలిచి ఈ ఘనత సాధించిన తొలి భారత గోల్ఫర్గా చరిత్ర సృష్టించిన విషయం విదితమే. అప్పటి నుంచి అతని పేరు వెలుగులోకి వచ్చింది. కాగా, తాజాగా ఒలింపిక్స్‌లో స్వర్ణం గెలిచి భారత్ సత్తా చాటాడు.