సరికొత్త చరిత్ర సృష్టించిన రణ్ వీర్ సింగ్ | Indian golfer Ranveer Saini bags gold in Special Olympics | Sakshi
Sakshi News home page

సరికొత్త చరిత్ర సృష్టించిన రణ్ వీర్ సింగ్

Published Sat, Aug 1 2015 12:30 PM | Last Updated on Sun, Sep 3 2017 6:35 AM

సరికొత్త చరిత్ర సృష్టించిన రణ్ వీర్ సింగ్

సరికొత్త చరిత్ర సృష్టించిన రణ్ వీర్ సింగ్

లాస్ ఎంజెల్స్: రణ్వీర్ సింగ్ సైని భారత్ తరఫున సరికొత్త చరిత్ర సృష్టించాడు. స్పెషల్ ఒలంపిక్స్ వరల్డ్ గేమ్స్లో స్వర్ణం సాధించి భారత్ తరఫున ఈ ఘన సాధించిన తొలి ఆటగాడిగా నిలిచాడు. లాస్ ఎంజిల్స్లో శుక్రవారం జరిగిన ఈ గేమ్లో 14 ఏళ్ల గోల్ఫర్ సైనీ తన భాగస్వామి మోనికా జగూతో కలిసి ఈ అరుదైన ఫీట్ సాధించాడు.

గుర్గావ్కు చెందిన రణ్వీర్ సైని ఆటిజంతో సతమతమవుతున్నాడు. రెండేళ్ల వయసు నుంచి నరాల సంబంధిత వ్యాధితో పోరాడుతున్న సైని తొమ్మిదేళ్ల ప్రాయంలో గోల్ఫ్ ఆడటం ప్రారంభించాడు. ఆసియా పసిఫిక్ వరల్డ్ గేమ్స్లో రెండు స్వర్ణాలు గెలిచి ఈ ఘనత సాధించిన తొలి భారత గోల్ఫర్గా చరిత్ర సృష్టించిన విషయం విదితమే. అప్పటి నుంచి అతని పేరు వెలుగులోకి వచ్చింది. కాగా, తాజాగా ఒలింపిక్స్లో స్వర్ణం గెలిచి భారత్ సత్తా చాటాడు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement