
భారత స్టార్ గోల్ఫర్ శివ్ కపూర్ స్వదేశంలో తొలి ఆసియా టూర్ టైటిల్‌ను గెల్చుకున్నాడు. ఆదివారం ఢిల్లీ గోల్ఫ్ క్లబ్‌లో ముగిసిన పానాసోనిక్ ఓపెన్ టోర్నీలో అతను విజేతగా నిలిచాడు. ఫోర్ అండర్ 68 స్కోరుతో శివ్ కపూర్ అగ్రస్థానంలో నిలిచాడు. ఈ ఏడాది శివ్ కపూర్‌కిది రెండో ఆసియా టూర్ టైటిల్ కాగా కెరీర్‌లో మూడోది. గత ఏప్రిల్‌లో అతను యెంగ్డెర్ హెరిటేజ్ ఓపెన్‌లో చాంపియన్‌గా నిలిచాడు. 2005లో శివ్ కపూర్ తొలిసారి వోల్వో మాస్టర్స్ ఆసియా టూర్ టైటిల్‌ను గెలిచాడు.
Comments
Please login to add a commentAdd a comment