భారత్‌లో టైగర్ వుడ్స్ | Tiger Woods to earn seven-figure sum for exhibition in India | Sakshi
Sakshi News home page

భారత్‌లో టైగర్ వుడ్స్

Published Tue, Feb 4 2014 1:01 AM | Last Updated on Sat, Sep 2 2017 3:18 AM

భారత్‌లో టైగర్ వుడ్స్

భారత్‌లో టైగర్ వుడ్స్

న్యూఢిల్లీ: విఖ్యాత గోల్ఫర్ టైగర్ వుడ్స్ ఒకరోజు పర్యటన కోసం తొలిసారిగా భారత్‌లో అడుగుపెట్టాడు. తన సొంత జెట్ విమానంలో దిగిన వుడ్స్ పర్యటనను నిర్వాహకులు రహస్యంగా ఉంచారు. అటు మీడియాకు కానీ ఇటు అభిమానులకు కానీ తెలీకుండా జాగ్రత్తపడ్డారు. ఢిల్లీ గోల్ఫ్ క్లబ్‌లో అతడు నేడు (మంగళవారం) ఎగ్జిబిషన్ రౌండ్‌లో ఆడనున్నాడు.
 
 అతి తక్కువ మందికి మాత్రమే వుడ్స్‌ను కలుసుకునేందుకు అనుమతించనున్నారు. వచ్చినవారు వుడ్స్‌ను ఆటోగ్రాఫ్‌లు, ఫొటోగ్రాఫ్స్ కానీ అడగకూడదని తేల్చి చెప్పారు. భారత గోల్ఫర్ అర్జున్ అత్వాల్‌కు  మంచి స్నేహితుడైన వుడ్స్ హీరో మోటో కార్ప్ సీఈవో, ఎండీ పవన్ ముంజల్ ఆహ్వానం మేరకు భారత్‌కు వచ్చాడు. ఈ రాక ద్వారా వుడ్స్‌కు 2.5 మిలియన్ డాలర్లు ముట్టనున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement