Delhi Golf Club
-
గుండెపోటును దాటి గోల్ఫ్‌కు...
న్యూఢిల్లీ: ఇటీవలే గుండెపోటుకు గురైన భారత విఖ్యాత కెప్టెన్ కపిల్ దేవ్ మళ్లీ మైదానంలోకి దిగారు. తన ఫిట్నెస్ స్థాయి ఏంటో చాటారు. 61 ఏళ్ల కపిల్‌కు ఇటీవలే యాంజియోప్లాస్టీ చేశారు. కాస్త విశ్రాంతి తీసుకున్న ఆయన వైద్యుల అనుమతితో గురువారం ఢిల్లీ గోల్ఫ్ క్లబ్లో గోల్ఫ్ ఆడారు. భారత్‌కు తొలి ప్రపంచకప్ (1983) అందించిన ఆయన తదనంతరం తనకెంతో ఇష్టమైన గోల్ఫ్ వైపు మళ్లారు. మళ్లీ మైదానంలోకి దిగడంపై కపిల్ ట్వీట్ చేశారు. ‘ఈ అనుభూతిని మాటల్లో వివరించలేను. గోల్ఫ్ కోర్స్, క్రికెట్ గ్రౌండ్... ఏదైనా సరే మళ్లీ ఆడటమనేది చాలా ఉల్లాసంగా, ఎంతో ఆనందంగా ఉంది. నా మిత్రులతో కలిసి ఇలా సరదాగా ఆడటం నిజంగా తృప్తినిచ్చింది. జీవితమంటే ఇదేనేమో!’ అని ట్విట్టర్లో పేర్కొన్నారు. అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పాక 1994 నుంచి కపిల్ దేవ్ రెగ్యులర్‌గా గోల్ఫ్ ఆడుతున్నారు. పలు ఈవెంట్లలోనూ పోటీపడ్డారు. -
గోల్ఫర్ శివ్ కపూర్‌కు స్వదేశంలో తొలి ఆసియా టూర్ టైటిల్
భారత స్టార్ గోల్ఫర్ శివ్ కపూర్ స్వదేశంలో తొలి ఆసియా టూర్ టైటిల్‌ను గెల్చుకున్నాడు. ఆదివారం ఢిల్లీ గోల్ఫ్ క్లబ్లో ముగిసిన పానాసోనిక్ ఓపెన్ టోర్నీలో అతను విజేతగా నిలిచాడు. ఫోర్ అండర్ 68 స్కోరుతో శివ్ కపూర్ అగ్రస్థానంలో నిలిచాడు. ఈ ఏడాది శివ్ కపూర్‌కిది రెండో ఆసియా టూర్ టైటిల్ కాగా కెరీర్లో మూడోది. గత ఏప్రిల్‌లో అతను యెంగ్డెర్ హెరిటేజ్ ఓపెన్‌లో చాంపియన్‌గా నిలిచాడు. 2005లో శివ్ కపూర్ తొలిసారి వోల్వో మాస్టర్స్ ఆసియా టూర్ టైటిల్‌ను గెలిచాడు. -
భారత్‌లో టైగర్ వుడ్స్
న్యూఢిల్లీ: విఖ్యాత గోల్ఫర్ టైగర్ వుడ్స్ ఒకరోజు పర్యటన కోసం తొలిసారిగా భారత్‌లో అడుగుపెట్టాడు. తన సొంత జెట్ విమానంలో దిగిన వుడ్స్ పర్యటనను నిర్వాహకులు రహస్యంగా ఉంచారు. అటు మీడియాకు కానీ ఇటు అభిమానులకు కానీ తెలీకుండా జాగ్రత్తపడ్డారు. ఢిల్లీ గోల్ఫ్ క్లబ్లో అతడు నేడు (మంగళవారం) ఎగ్జిబిషన్ రౌండ్లో ఆడనున్నాడు. అతి తక్కువ మందికి మాత్రమే వుడ్స్‌ను కలుసుకునేందుకు అనుమతించనున్నారు. వచ్చినవారు వుడ్స్‌ను ఆటోగ్రాఫ్‌లు, ఫొటోగ్రాఫ్స్ కానీ అడగకూడదని తేల్చి చెప్పారు. భారత గోల్ఫర్ అర్జున్ అత్వాల్‌కు మంచి స్నేహితుడైన వుడ్స్ హీరో మోటో కార్ప్ సీఈవో, ఎండీ పవన్ ముంజల్ ఆహ్వానం మేరకు భారత్‌కు వచ్చాడు. ఈ రాక ద్వారా వుడ్స్‌కు 2.5 మిలియన్ డాలర్లు ముట్టనున్నాయి. -
తొలిసారి భారత్ కు వచ్చిన టైగర్ వుడ్స్
న్యూఢిల్లీ: ప్రఖ్యాత గోల్ఫ్ క్రీడాకారుడు టైగర్ వుడ్స్ సోమవారం న్యూఢిల్లీ వచ్చాడు. భారత పర్యటనకు తొలిసారి విచ్చేసిన వుడ్స్ మంగళవారం ఎగ్జిబిషన్ మ్యాచ్ ఆడనున్నాడు. అగ్రశేణి మోటార్ సైకిల్ కంపెనీ హీరో మోటో కార్ప్ ఈ మ్యాచ్ నిర్వహిస్తోంది. ప్రపంచ నెంబర్ వన్ గోల్ఫ్ క్రీడాకారుడైన టైగర్ వుడ్స్.. దుబాయ్ నుంచి ఇక్కడికి చేరుకున్నాడు. దుబాయ్ డిసర్ట్ క్లాసిక్ టోర్నమెంట్లో పాల్గొని ఇక్కడికి వచ్చాడు. మంగళవారం జరిగే ఎగ్జిబిషన్ మ్యాచ్‌లో హీరో మోటో కార్ప్ సీఈవో, మేనేజింగ్ డైరెక్టర్ పవర్ ముంజుల్, ఢిల్లీ గోల్ఫ్ క్లబ్ సభ్యులతో అతడు తలపడతాడు. భారత అగ్రశ్రేణి గోల్ప్ క్రీడాకారులు శివ్ కపూర్, అనిర్బాన్ లాహిరితో అతడు పోటీ పడతాడు.