Indian golfer
-
గోల్ఫర్ సాహిత్ రెడ్డికి నిరాశ
కాలిఫోర్నియా: ప్రొకోర్ చాంపియన్‌షిప్ గోల్ఫ్ టోర్నమెంట్లో డిఫెండింగ్ చాంపియన్, భారత సంతతి అమెరికా గోల్ఫర్ తీగల సాహిత్ రెడ్డి ఈసారి టైటిల్ నిలబెట్టుకోలేకపోయాడు. ఈ టోర్నీలో సాహిత్ 12 అండర్ 276 పాయింట్లతో మరో నలుగురితో కలిసి సంయుక్తంగా ఐదో స్థానంలో నిలిచాడు. ప్యాటన్ కిజైర్ (అమెరికా) 20 అండర్ 268 పాయింట్లతో చాంపియన్‌గా అవతరించాడు. డేవిడ్ లిప్స్కీ (అమెరికా) రెండో స్థానంలో, ప్యాట్రిక్ ఫిష్‌బర్న్ (అమెరికా) మూడో స్థానంలో నిలిచారు.విజేతగా నిలిచిన ప్యాటర్ కిజైర్కు 10,80,000 డాలర్లు (రూ. 9 కోట్ల 5 లక్షలు), రన్నరప్ లిప్‌స్కీకి 6,54,000 డాలర్లు (రూ. 5 కోట్ల 48 లక్షలు), సెకండ్ రన్నరప్ ఫిష్బర్న్కు 4,14,000 డాలర్లు (రూ. 3 కోట్ల 47 లక్షలు) ప్రైజ్‌మనీగా లభించాయి. సంయుక్తంగా ఐదో స్థానంలో నిలిచిన తీగల సాహిత్ 1,76,100 డాలర్ల (రూ. 1 కోటి 47 లక్షలు) ప్రైజ్‌మనీని దక్కించుకున్నాడు.హైదరాబాద్‌కు చెందిన తీగల సాహిత్ తల్లిదండ్రులు 1980 దశకంలో అమెరికాలో స్థిరపడ్డారు. సాహిత్ అమెరికాలోనే పుట్టి పెరిగి గోల్ఫర్గా రాణిస్తున్నాడు. -
గోల్ఫర్ శివ్ కపూర్‌కు స్వదేశంలో తొలి ఆసియా టూర్ టైటిల్
భారత స్టార్ గోల్ఫర్ శివ్ కపూర్ స్వదేశంలో తొలి ఆసియా టూర్ టైటిల్‌ను గెల్చుకున్నాడు. ఆదివారం ఢిల్లీ గోల్ఫ్ క్లబ్లో ముగిసిన పానాసోనిక్ ఓపెన్ టోర్నీలో అతను విజేతగా నిలిచాడు. ఫోర్ అండర్ 68 స్కోరుతో శివ్ కపూర్ అగ్రస్థానంలో నిలిచాడు. ఈ ఏడాది శివ్ కపూర్‌కిది రెండో ఆసియా టూర్ టైటిల్ కాగా కెరీర్లో మూడోది. గత ఏప్రిల్‌లో అతను యెంగ్డెర్ హెరిటేజ్ ఓపెన్‌లో చాంపియన్‌గా నిలిచాడు. 2005లో శివ్ కపూర్ తొలిసారి వోల్వో మాస్టర్స్ ఆసియా టూర్ టైటిల్‌ను గెలిచాడు. -
సరికొత్త చరిత్ర సృష్టించిన రణ్ వీర్ సింగ్
లాస్ ఎంజెల్స్: రణ్వీర్ సింగ్ సైని భారత్ తరఫున సరికొత్త చరిత్ర సృష్టించాడు. స్పెషల్ ఒలంపిక్స్ వరల్డ్ గేమ్స్‌లో స్వర్ణం సాధించి భారత్ తరఫున ఈ ఘన సాధించిన తొలి ఆటగాడిగా నిలిచాడు. లాస్ ఎంజిల్స్‌లో శుక్రవారం జరిగిన ఈ గేమ్‌లో 14 ఏళ్ల గోల్ఫర్ సైనీ తన భాగస్వామి మోనికా జగూతో కలిసి ఈ అరుదైన ఫీట్ సాధించాడు. గుర్గావ్కు చెందిన రణ్వీర్ సైని ఆటిజంతో సతమతమవుతున్నాడు. రెండేళ్ల వయసు నుంచి నరాల సంబంధిత వ్యాధితో పోరాడుతున్న సైని తొమ్మిదేళ్ల ప్రాయంలో గోల్ఫ్ ఆడటం ప్రారంభించాడు. ఆసియా పసిఫిక్ వరల్డ్ గేమ్స్‌లో రెండు స్వర్ణాలు గెలిచి ఈ ఘనత సాధించిన తొలి భారత గోల్ఫర్గా చరిత్ర సృష్టించిన విషయం విదితమే. అప్పటి నుంచి అతని పేరు వెలుగులోకి వచ్చింది. కాగా, తాజాగా ఒలింపిక్స్‌లో స్వర్ణం గెలిచి భారత్ సత్తా చాటాడు.