మానసిక వికలాంగురాలిపై అత్యాచారం.. ఇద్దరు అరెస్టు | Two arrested for raping mentally-ill girl | Sakshi
Sakshi News home page

మానసిక వికలాంగురాలిపై అత్యాచారం.. ఇద్దరు అరెస్టు

Published Mon, Mar 16 2015 7:10 PM | Last Updated on Tue, Oct 16 2018 4:50 PM

Two arrested for raping mentally-ill girl

థానే: పాఠశాల విద్యనభ్యసిస్తున్న ఓ మానసిక వికలాంగురాలిపై వరుసగా లైంగిక దాడికి పాల్పడిన ఇద్దరు వ్యక్తులను పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. నౌపడలోని గనేశ్ వాహ్(24), గనేశ్ బోర్డే(40) అనే ఇద్దరు వ్యక్తులు గత ఏడాది నవంబర్ నుంచి ఆమెపై అత్యాచారం చేస్తున్నారు. ప్రస్తుతం ఆమె మూడు నెలల గర్భవతి. తల్లిదండ్రులను కోల్పోయిన ఆ బాధితురాలు నౌపదలో తన పిన్ని వద్ద ఉంటూ చదువుకుంటోంది. గత నవంబర్ నెలలో పాఠశాలకు వెళ్లొస్తున్న సదరు బాలికకు మాయమాటలు చెప్పి తీసుకెళ్లిన వాహ్, బోర్డే ఆ రోజు నుంచి లైంగికదాడి కొనసాగించారు. ఎవరికైనా చెప్తే పరువు తీస్తాం, ప్రాణం తీస్తామంటూ బెదిరించారు. చివరికి ఈ విషయం బయటకు తెలియడంతో పోలీసులు నిందితులను అరెస్టు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement