రంగారెడ్డి (కుత్బుల్లాపూర్): హైదరాబాద్ నగరం బాలానగర్ పరిధిలోని రంగారెడ్డి నగర్‌లో చర్చి ఎక్కి మతిస్థిమితం లేని వ్యక్తి హంగామా సృష్టించాడు. వివరాలు.. ఇబ్రహీంపట్నంకు చెందిన అరుణ్(28)కు మతిస్థిమితం లేదు. రంగారెడ్డినగర్‌లో ఉంటున్న తన పిన్నమ్మ ఇంటికి రెండు రోజుల క్రితం వచ్చాడు. శనివారం ఉదయం చర్చి మూడో అంతస్తు మీద ఉన్న ఏసు ప్రభువు శిలువ మీదకెక్కడంతో రోడ్డుపైన ఉన్న జనం గుమిగూడారు. విషయం తెలుసుకున్న బాలానగర్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. బాలానగర్ కానిస్టేబుల్ నవీన్, చర్చి మీదున్న అరుణ్‌ని మెల్లగా మాటల్లో పెట్టి కిందికి దిగేలా చేశాడు. సుమారు గంటపాటు ఈ తతంగం నడిచింది.