
మతిస్థిమితం లేని యువతిపై సామూహిక అత్యాచారం
ప్రకాశం జిల్లా పొదిలి మండలం జువలేరులో దారుణం చోటు చేసుకుంది. మతిస్థిమితం లేని యువతిపై ఇద్దరు యువకులు సామూహిక అత్యాచారం చేశారు. అనంతరం ఆ యువకులు పరారయ్యారు. మతిస్థిమితం లేని యువతిపై జరిగిన దారుణాన్ని గమనించిన స్థానికులు వెంటనే ఆమె తల్లితండ్రులకు విషయాన్ని వివరించారు.
దాంతో ఆ యువతి తల్లితండ్రులు పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. మతిస్థిమితం లేని యువతిని వైద్య పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. నిందితులను సాధ్యమైనంత త్వరగా పట్టుకుంటామని పోలీసులు వెల్లడించారు.