యువతి ఆరోగ్య పరిస్థితిపై వివరాలు తెలుసుకొంటున్న ఏపీడీ నాగశైలజ తదితరులు
చౌడేపల్లె: అత్యాచారానికి గురైన మతిస్థిమితం లేని తిరుపతికి చెందిన ఓ యువతిని చిత్తూరు అమ్మ ఒడి కేంద్రానికి తరలిస్తున్నట్లు ఐసీడీఎస్ ఏపీడీ నాగశైలజ తెలిపారు. గురువారం ఐసీడీఎస్ సీడీపీవో సరస్వతితో కలిసి ఆమె పుంగనూరు ప్రభుత్వ వైద్యశాలలో చికిత్స పొందుతున్న యువతిని పరామర్శించారు. ఈ నెల 27వ తేదీ రాత్రి ఆ యువతితో ఆటోడ్రైవర్లు ప్రవర్తించిన తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం ఆ యువతిని చిత్తూరు అమ్మ ఒడికి తరలించి రక్షణ కల్పించేలా చర్యలు తీసుకొంటున్నట్లు చెప్పారు. ఆమె వెంట ఏసీడీపీవో వాణిశ్రీదేవి, సూపర్‌వైజర్లు నాగరత్న, మాధవీలత తదితరులున్నారు.