నందిగామ: మతిస్థిమితం లేనివారు ఎప్పుడు ఏమి చేస్తారో వారికో తెలియదు. ఆ కోవలోనే ఓ మతిస్థిమితం లేని వ్యక్తి తన కుటుంబీకులపై విచక్షణా రహితంగా దాడి చేయగా ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. కృష్ణాజిల్లా నందిగామ మండలం లింగాలపాడు గ్రామంలో జరిగిన ఈ దారుణ సంఘటన వివరాలిలా ఉన్నాయి.
వేముల ముత్యాలు అనే వ్యక్తికి మతిస్థిమితం లేదు. ఆ వ్యక్తి తన తండ్రి, భార్య, పెద్దమ్మలపై కర్రతో విచక్షణారహితంగా దాడి చేశాడు. ఈ సంఘటనలో అనంతమ్మ అనే మహిళకు తీవ్ర గాయాలుకాగా పరిస్థితి విషమంగా ఉంది. భార్య పార్వతి, తండ్రి గురవయ్యకు కూడా తీవ్ర గాయాలు కాగా చికిత్స నిమిత్తం నందిగామ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అనంతమ్మను విజయవాడకు తరలించారు.
Comments
Please login to add a commentAdd a comment