తిరుత్తణిలో వికలాంగుల దినోత్సవం
తిరుత్తణి, న్యూస్‌లైన్: తిరుత్తణిలోని మురుగప్ప నగర్‌లో ఉన్న రాస్ స్వచ్ఛంద సంస్థ మానసిక వికలాంగుల స్పెషల్ స్కూల్‌లో ప్రపంచ వికలాంగుల దినోత్సవం నిర్వహించారు. తిరుత్తణి గోల్డన్ టవర్ లయన్స్ క్లబ్ అధ్యక్షుడు లయన్ హరికుమార్ శర్మ అధ్యక్షతలో జరిగిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా లయన్స్ క్లబ్ మాజీ గవర్నర్ వెంకట సుబ్బు పాల్గొని వికలాంగ విద్యార్థులకు కౌన్సిలింగ్ జరిపారు.
తర్వాత విద్యార్థులకు లయన్స్ క్లబ్ తరపున సిల్వర్ ప్లేట్లు, బిస్కెట్లు, పెన్సిల్ బాక్సులు, చాపలు అందించారు.లయన్స్ క్లబ్ జిల్లా అధ్యక్షుడు ఉదయశంకర్, జిల్లా మాజీ విద్యాశాఖ ప్రధాన అధికారి వెంకటశేషు, లయ న్స్ క్లబ్ కార్యదర్శి విశ్వనాథన్, ఉపాధ్యక్షులు గౌతంచంద్, టీడీ రంగనాథన్, ఉప కార్యదర్శి గిరిష్‌కుమార్, డెరైక్టర్లు మనోహర పాండ్యన్, మునికృష్ణ, ప్రాజెక్ట్ ఆఫీసర్ మునస్వామి నాయుడు పాల్గొన్నారు.