మాట్లాడుతున్న మంత్రి తుమ్మల
సాక్షి, నేలకొండపల్లి: తెలంగాణలో సంక్షేమం, అభివృద్ధి రెండూ ప్రధాన లక్ష్యాలుగా పాలన సాగించినట్లు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. మండలంలోని బోదులబండ, మండ్రాజుపల్లి, పైనంపల్లి గ్రామాల్లో శుక్రవారం ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పేదలకు సంక్షేమ.. పల్లెలు అభివృద్ధి ఏజెండాగా సీఎం కేసీఆర్ పాలించారని అన్నారు. 70 ఏళ్లలో కాంగ్రెస్ చేయని అభివృద్ధిని రెండేళ్లలో తాను చేసి చూపించానని అన్నారు. పాలేరును రాష్ట్రంలో నెంబర్ వన్ స్థానంలో ఉంచేందుకు కృషి చేస్తున్నట్లు పేర్కొన్నారు. కరువు ప్రాంతాన్ని సస్యశ్యామలం చేసిన ఘనత టీఆర్‌ఎస్ ప్రభుత్వానికే దక్కుతుందని అన్నారు. పాలేరు పాత కాలువను రూ.70 కోట్లతో అభివృద్ధి చేసి రైతుల చివర భూములకు నీరందించినట్లు తెలిపారు. మీరు అడిగినా, అడగకున్నా అభివృద్ధి చేసి శభాష్ అని
పించుకుంటామని అన్నారు. పదవుల కోసం, స్వార్థం కోసం, ఎన్నికల సమయం వచ్చినప్పుడు ఇలా వచ్చి.. ఆలా వెళ్లే వాడిని కాదన్నారు. మీరు ఇచ్చిన గౌరవానికి మరింత గౌరవం పెంచే విధంగా మిగిలిన పనులు పూర్తి చేయనున్నట్లు తెలిపారు. ఈ సభలో పాలేరు సమన్వయకర్త సాధు రమేష్‌రెడ్డి, జెడ్పీటీసీ అనిత, టీఆర్‌ఎస్ మండల అధ్యక్ష, కార్యదర్శులు సీతారాములు, కోటి సైదారెడ్డి, యడవల్లి సైదులు, నెల్లూరి భద్రయ్య, కట్టేకోల నాగేశ్వరరావు, అనగాని నరసింహారావు, కొడాలి గోవిందరావు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment