బాలకృష్ణ ఇంటి ముందు ఎండ్ల బండ్లతో నిరసన | villagers protest opposition of balakrishna's house | Sakshi
Sakshi News home page

బాలకృష్ణ ఇంటి ముందు ఎండ్ల బండ్లతో నిరసన

Published Thu, Jul 9 2015 8:07 PM | Last Updated on Wed, Aug 29 2018 1:59 PM

బాలకృష్ణ ఇంటి ముందు ఎండ్ల బండ్లతో నిరసన - Sakshi

బాలకృష్ణ ఇంటి ముందు ఎండ్ల బండ్లతో నిరసన

హిందూపురం: మరుగుదొడ్ల నిర్మాణాలకు ఇసుక తెచ్చుకుంటుంటే పోలీసులు వేధిస్తున్నారంటూ గురువారం అనంతపురం జిల్లా పరిగి మండలం శాసనకోట గ్రామస్తులు హిందూపురంలోని ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఇంటి ముందు ఎడ్లబండ్లతో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. శాసనకోట ప్రాంతంలోని పెన్నానది పరీవాహక ప్రాంతం నుంచి ప్రతిరోజూ ట్రాక్టర్ల ద్వారా ఇసుక అక్రమంగా తరలిపోతోందని తెలిపారు.

ఒక చలానా కట్టి.. దాన్నే కలర్ జిరాక్స్‌లు చేసి పెద్ద ఎత్తున ఇసుక తరలించుకుపోతున్నా పట్టించుకోని పోలీసులు, రెవెన్యూ అధికారులు.. తమను మాత్రం చితకబాదుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంలో ఎమ్మెల్యే బాలకృష్ణ కలగజేసుకుని.. న్యాయం చేయాలని ఈ సందర్భంగా వారు డిమాండ్ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement