hindupur mla
-
ఎన్నో దెబ్బలు తిన్నా.. ఇది ఓ లెక్కా..
సాక్షి, అమరావతి : మార్చి 29న ఎన్టీఆర్ సినిమా షూటింగ్ ప్రారంభిస్తామని హిందూపూర్ ఎమ్మెల్యే, నటుడు నందమూరి బాలకృష్ణ ప్రకటించారు. నేటి నుంచి ప్రారంభం కానున్న బడ్జెట్ సమావేశాల్లో పాల్గొనడానికి అమరావతి వచ్చిన ఆయన మీడియాతో ముచ్చటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హైదరాబాద్ రామకృష్ణ సినీ స్టూడియోలో తొలిషెడ్యూల్ షూటింగ్ ప్రారంభిస్తామన్నారు. నందమూరి తారక రామారావు వాస్తవ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం ఇదని, ఎన్నికల సందర్భంగా తీసే సినిమా కాదన్నారు. సినిమా షూటింగ్‌ను వేగవంతంగా పూర్తి చేసి వచ్చే సంక్రాంతికి విడుదల చేయాలని భావిస్తున్నట్లు తెలిపారు. ఎన్టీఆర్ మీద ఉన్న అభిమానంతో చాలా మంది చాలా పేర్లు సూచించారని, కానీ ఎన్టీఆర్‌ను మించిన పేరు లేదని భావించి ఆపేరునే ఖరారు చేశామని చెప్పారు. పార్టీలకు అతీతంగా ఎన్టీఆర్‌కు అభిమానులున్నారని, ప్రతిఒక్కరు అభినందించిన వారేనని అన్నారు. ఇటీవలే శష్త్ర చికిత్స చేసుకున్న బాలకృష్ణ, కట్టుతోనే అసెంబ్లీకి వచ్చారు. ఈసందర్భంగా ఆయన్ను పలువురు ఎమ్మెల్యేలు పరామర్శించారు. జీవితంలో తగిలిన ఎన్నో దెబ్బలతో పోలిస్తే ఇది పెద్ద దెబ్బేమీ కాదని బాలయ్య వారికి సమాధానం ఇచ్చారు. మార్చి31 నుంచి ఏప్రిల్ 1 వరకూ లేపాక్షి ఉత్సవాలు నిర్వహిస్తామని ప్రకటించారు. హంద్రీనీవా సుజల స్రవంతికి జలహారతి నిర్వహించి ఉత్సవాలను ప్రారంభిస్తామని తెలిపారు. -
బాలకృష్ణ ఇలాకాలో ఉద్రిక్తత
హిందూపురం: ప్రముఖ సినీ నటుడు, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వియ్యంకుడు నందమూరి బాలకృష్ణ ప్రాతినిధ్యం వహిస్తున్న అనంతపురం జిల్లా హిందూపురంలో శనివారం ఉద్రిక్తత ఏర్పడింది. బాలకృష్ణ ఇచ్చిన హామీలను నెరవేర్చాలని, హిందూపురంలో కూరగాయల మార్కెట్‌ను నిర్మించాలని డిమాండ్ చేస్తూ వైఎస్ఆర్ సీపీ ధర్నాకు దిగగా, పోలీసులు అడ్డుకున్నారు. హిందూపురం నియోజకవర్గం వైఎస్ఆర్ సీపీ సమన్వయకర్త నవీన్ నిశ్చల్ ఇంటివద్ద పోలీసులను భారీగా మోహరించారు. ధర్నాలో పాల్గొనేందుకు నవీన్‌ను ఇంటినుంచి బయటకు రానీయకుండా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో నవీన్ ఇంటి వద్ద వైఎస్ఆర్ సీపీ కార్యకర్తలకు, పోలీసులకు మధ్య వాగ్వాదం జరిగింది. ధర్నాలో పాల్గొనకుండా నవీన్‌ను ఎందుకు అడ్డుకుంటున్నారని పోలీసులను ప్రశ్నించారు. బాలకృష్ణ హామీలను విస్మరించడంపై ప్రజల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఇటీవల తాగునీటి సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ స్థానికులు నిరసన తెలియజేశారు. అప్పుడు కూడా పోలీసులు నిరసనకారులను అడ్డుకునే ప్రయత్నం చేశారు. స్థానిక ఎమ్మెల్యే బాలకృష్ణకు వ్యతిరేకంగా ఉద్యమాలు జరగకుండా, పోలీసులు ముందస్తుగానే అడ్డుకుంటున్నారు. ఈ నెల 7 నుంచి బాలకృష్ణ హిందూపురం నియోజకవర్గంలో పర్యటించనున్నారు. బాలకృష్ణ స్థానికులకు అందుబాటులో ఉండటం లేదని, సమస్యలను పట్టించుకోవడంలేదనే విమర్శలు వస్తున్నాయి. అంతేగాక సమస్యల పరిష్కారానికి పోరాటం చేస్తున్నవారిని పోలీసులు అడ్డుకోవడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
‘తీవ్రస్థాయిలో బాలకృష్ణ పీఏ అవినీతి’
అనంతపురం: అనంతపురం జిల్లా హిందూపురం అసెంబ్లీ నియోజకవర్గం వైఎస్ఆర్ సీపీ సమన్వయకర్త నవీన్ నిశ్చల్.. సినీ నటుడు, స్థానిక ఎమ్మెల్యే బాలకృష్ణపై మండిపడ్డారు. ఎమ్మెల్యే పదవి అంటే సినిమా షూటింగ్ అనుకుంటున్నారని విమర్శించారు. బాలకృష్ణ మూడు నెలల్లో ఒక రోజు మాత్రమే హిందూపురంలో పర్యటిస్తున్నారని నవీన్ నిశ్చల్ అన్నారు. హిందూపురంలో బాలకృష్ణ పీఏ అవినీతి తీవ్రస్థాయికి చేరిందని ఆరోపించారు. బాలకృష్ణకు హిందూపురం ప్రజల కష్టాలు పట్టవని నవీన్ విమర్శించారు. -
'ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలి'
-
'ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలి'
న్యూఢిల్లీ : ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక హోదా ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ డిమాండ్ చేశారు. రాష్ట్రాభివృద్ధికి కేంద్రం సహకరిస్తోందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. గురువారం న్యూఢిల్లీ వచ్చిన నందమూరి బాలకృష్ణ విలేకర్లతో మాట్లాడారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి 27, 28 తేదీల్లో జరగనున్న లేపాక్షి ఉత్సవాలు జరగనున్నాయని తెలిపారు. ఈ ఉత్సవాలకు కేంద్రమంత్రులను ఆహ్వానించినట్లు చెప్పారు. హిందూపురం అభివృద్ధికి అధిక నిధులు ఇవ్వాలని నందమూరి బాలకృష్ణ కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. -
కార్మిక మంత్రి అచ్చెంనాయుడును కలిసిన బాలకృష్ణ
-
బాలకృష్ణకు లోక్‌అదాలత్ నోటీసులు
హిందూపురం: అనంతపురం జిల్లా హిందూపురం ఎంఎల్ఏ, సినీ నటుడు బాలకృష్ణ, మున్సిపల్ చైర్పర్సన్ ఆర్.లక్ష్మి, మున్సిపల్ కమిషనర్ వీరభద్రరావుకు శనివారం లోక్‌అదాలత్ కోర్టు న్యాయమూర్తి ఏడీజే రాములు నోటీసులు జారీ చేశారు. ఈ నోటీసులో ఆగస్టు 1న లోక్‌అదాలత్‌కు హాజరుకావాలని ఆదేశించారు. హిందూపురం పట్టణంలోని బైపాస్ రోడ్డు నుంచి వన్‌టౌన్ పోలీసుస్టేషన్, ఫైర్‌స్టేషన్ మీదుగా పెనుకొండ రోడ్డుకు కలుపుతూ 1993లో 80 అడుగుల రోడ్డుగా విస్తరిస్తూ మాస్టర్ ప్లాన్ రూపొందించారు. ఈ రహదారిని ఏర్పాటు చేయడానికి పట్టణంలోని గురునాథ్ టాకీస్ నిర్వాహకులు పొలాలను కూడా మున్సిపాలిటికి ఉచితంగా అందించారు. అయితే నేటికి విస్తరణ చేపట్టలేదని పట్టణానికి చెందిన వెంకటరాముడు అనే వ్యక్తి లోక్‌అదాలత్‌ను ఆశ్రయించారు. ప్రజాప్రతినిధులు, మున్సిపల్ అధికారులు రోడ్డు విస్తరణలో చొరవ చూపకపోవడంతో ప్రజలకు తీవ్ర ఇబ్బంది కలుగుతోందని న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లారు. స్పందించిన న్యాయమూర్తి ప్రతివాదులైన ఎంఎల్ఏ బాలకృష్ణ, చైర్పర్సన్, మున్సిపల్ కమిషనర్‌కు నోటీసులు జారీ చేశారు. -
బాలకృష్ణ ఇంటి ముందు ఎండ్ల బండ్లతో నిరసన
హిందూపురం: మరుగుదొడ్ల నిర్మాణాలకు ఇసుక తెచ్చుకుంటుంటే పోలీసులు వేధిస్తున్నారంటూ గురువారం అనంతపురం జిల్లా పరిగి మండలం శాసనకోట గ్రామస్తులు హిందూపురంలోని ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఇంటి ముందు ఎడ్లబండ్లతో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. శాసనకోట ప్రాంతంలోని పెన్నానది పరీవాహక ప్రాంతం నుంచి ప్రతిరోజూ ట్రాక్టర్ల ద్వారా ఇసుక అక్రమంగా తరలిపోతోందని తెలిపారు. ఒక చలానా కట్టి.. దాన్నే కలర్ జిరాక్స్‌లు చేసి పెద్ద ఎత్తున ఇసుక తరలించుకుపోతున్నా పట్టించుకోని పోలీసులు, రెవెన్యూ అధికారులు.. తమను మాత్రం చితకబాదుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంలో ఎమ్మెల్యే బాలకృష్ణ కలగజేసుకుని.. న్యాయం చేయాలని ఈ సందర్భంగా వారు డిమాండ్ చేశారు. -
హిందూపురంలో బాలయ్య ప్రజాదర్బార్
హిందూపురం: అనంతపురం జిల్లా హిందూపురంలో స్థానిక శాసనసభ్యుడు, నటుడు నందమూరి బాలకృష్ణ బుధవారం ప్రజాదర్బార్ నిర్వహించారు. ఈ సందర్భంగా నియోజకవర్గ ప్రజల నుంచి వివిధ సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అలాగే వినతి పత్రాలు స్వీకరించారు. వాటిని పరిష్కరిస్తామని ఆయన ప్రజలకు హామీ ఇచ్చారు. ప్రజల సమస్యలపై బాలకృష్ణ ఉన్నతాధికారులతో చర్చిస్తున్నారు. ఈ ప్రజాదర్బరు కార్యక్రమం రెండు రోజుల పాటు కొనసాగనుంది. అలాగే హిందూపురం మున్సిపాలిటీ పరిధిలో ప్రధాన సమస్యలను పరిష్కరించేందుకు చేపట్టాల్సిన పనులపై ప్రజల సమక్షంలోనే బాలకృష్ణ ఉన్నతాధికారులతో మాట్లాడుతున్నారు. -
మంత్రి కామినేనిని కలిసిన బాలకృష్ణ
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వైద్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్‌ను సినీనటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ సోమవారం ఉదయం కలిశారు. అనంతరం బాలకృష్ణ మీడియాతో మాట్లాడుతూ.. ఏపీ రాజధానిలో బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రి ఏర్పాటుకు 30 ఎకరాలు కావాలని కోరినట్టు బాలకృష్ణ తెలిపారు. ఆ విషయంపై ఇప్పటికే సీఎం చంద్రబాబునాయుడుతో మాట్లాడానని బాలయ్య అన్నారు. తనను గెలిపించిన హిందూపురం ప్రజలకు రుణపడి ఉంటానని భరోసా ఇచ్చారు. అదే విధంగా 'పురం'లో ఆస్పత్రిని అభివృద్ధి చేస్తానని బాలకృష్ణ ఈ సందర్భంగా తెలియజేశారు. -
టీడీపీలో బాలయ్య పీఏ చిచ్చు
అనంతపురం: తెలుగుదేశం పార్టీకి పెట్టని కోట అనంతపురం జిల్లా. ఆ జిల్లాలో తెలుగు తమ్ముళ్లు వర్గ పోరు మరోసారి రచ్చ కెక్కింది. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీఆర్ గతంలో ప్రాతినిధ్యం వహించిన... ప్రస్తుతం ఆయన కుమారుడు, ప్రముఖ నటుడు నందమూరి బాలకృష్ణ హిందూపురం ఎమ్మెల్యేగా ఉన్న ఆ నియోజకవర్గంలోని చిలమత్తూరు గ్రామంలో బుధవారం పార్టీ విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ఎంపీపీ నౌదియా బానుతో పాటు మరో వర్గం నాయకుడు బ్రహ్మానందరెడ్డి ... ఆయన వర్గీయులు హాజరయ్యారు. అయితే ఎమ్మెల్యే బాలకృష్ణ పీఏ శేఖర్ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారంటూ సమావేశంలో బ్రహ్మానందరెడ్డి వర్గీయులు ఆరోపించారు. దాంతో నౌదియ బాను వర్గీయలు.. బ్రహ్మానందరెడ్డి వర్గీయులను వారించేందుకు ప్రయత్నించారు. ఆ క్రమంలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. కుర్చీలతో ఇరు వర్గాలు ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. దాంతో సమావేశం కాస్త రసాభాసగా మరింది. పోలీసులు రంగ ప్రవేశం చేసి ఇరు వర్గాల వారిని శాంతిప చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. -
బాలయ్య 'బస్సులు' ఫ్లాప్
అనంతపురం: హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ ఎంతో ఆర్భాటంగా ప్రారంభించిన ఆర్టీసీ బస్సులు ఎక్కడపడితే అక్కడ ఆగిపోవడంతో ప్రయాణికుల బాధలు వర్ణాణాతీతం. శనివారం ఏపీ 28 జెడ్ 5181 నంబరు గల పల్లె వెలుగు బస్సు లేపాక్షి సమీపంలోని నవోదయ విద్యాలయం వద్ద ఆగిపోయింది. చెక్‌పోస్టు నుంచి హిందూపురానికి వస్తున్న ఈ బస్సులో సుమారు 50 మంది విద్యార్థులు ఉన్నారు. దీంతో ఆ బస్సు విద్యార్థులు లేపాక్షి దాకా తోసుకువచ్చారు. అక్కడ నుంచి కదిలేందుకు ఆ బస్సు మొరాయించింది. దీంతో విద్యార్థులు మరో బస్సు వచ్చేదాకా వేచి ఉండాల్సి వచ్చింది. ఇదిలా ఉండగా 15 రోజుల కిందట కల్లూరు గ్రామంలో దర్గాలో ప్రత్యేక పూజలు నిర్వహించేందుకు జెడ్పీ ఛైర్మన్ చమన్ విచ్చేశారు. రాత్రి 10 గంటల సమయంలో హిందూపురం నుంచి కొండూరుకు వేళ్లే ఆర్టీసీ సర్వీసు దర్గా వద్ద ఆగిపోయింది. జెడ్పీ ఛైర్మన్ అంతకుముందే పూజలు నిర్వహించి వెళ్లారు. చమన్ వెళ్లే సమయంలోనే బస్సు ఆగిపోయి ఉంటే ప్రజలు రాత్రివేళ బస్సును తోస్తూ పడే బాధలను ఆయన ప్రత్యక్షంగా చూసేవారని స్థానికులు తెలిపారు. రెండు రోజుల కిందట కూడా నాయనిపల్లి క్రాస్ హిందూపురం నుంచి కొడికొండకు వెళ్తున్న ఆర్టీసీ బస్సు మొరాయించింది. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఆర్టీసీ వారు కాలం చెల్లిన బస్సులు నడపడం వల్లే ఇబ్బందులు పడుతున్నామని ప్రయాణికులు ఆరోపిస్తున్నారు. హిందూపురం ఆర్టీసీ డిపోకు కొత్త పల్లె వెలుగు సర్వీసులు, సూపర్ లగ్జరీ బస్సులు అదనంగా వచ్చాయని, వాటిని సంబంధిత అధికారులు కలరింగ్ ఇచ్చారు. వాస్తవంగా పల్లె వెలుగు సర్వీసులన్నీ కాలం చెల్లినవే. వాటికే రంగులు వేయించి కొత్తవంటూ బీరాలు పోతున్న విషయాన్ని ఏం మాయచేశారో అనే శీర్షికతో ఇటీవల సాక్షి ఓ కథనాన్ని ప్రచురించింది. అయినా ఆర్టీసీ అధికారులు మాత్రం ఇంకా మార్పు రాలేదు. బాలయ్య ఈ నెల 14న తన నియోజకవర్గమైన హిందూపురంలో 14 కొత్త ఆర్టీసు బస్సులను ప్రారంభించిన సంగతి తెలిసిందే. -
'ప్రజాసేవ కోసమే బాలకృష్ణ మంత్రి పదవి వదులుకున్నారు'
ప్రజలకు సేవ చేసేందుకు ప్రముఖ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ మంత్రి పదవిని సైతం వదులుకున్నారని ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ కోడెల శివప్రసాద్ తెలిపారు. ఆదివారం హైదరాబాద్‌లో బసవతారకం ఇండోఅమెరికన్ క్యాన్సర్ హాస్పటల్ 14వ వార్షికోత్సవ సభలో కోడెల శివప్రసాదరావు ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. ఈ సందర్బంగా బాలకృష్ణ మాట్లాడుతూ... బసవతారకం ఇండోఅమెరికన్ క్యాన్సర్ హాస్పటల్లో ప్రపంచస్థాయి క్యాన్సర్ చికిత్సను పేషెంట్లకు అందిస్తామని వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్‌లో కూడా ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆసుపత్రిని నిర్మిస్తామని తెలిపారు. బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆసుపత్రి అభివృద్ధిలో స్పీకర్ కోడెల చేసిన విశేష కృషిని ఆ ఆసుపత్రి ఛైర్మన్ అయిన బాలకృష్ణ ఈ సందర్భంగా గుర్తు చేశారు.Follow @sakshinews -
మంత్రి పదవి ఆశించలేదు: బాలకృష్ణ
అనంతపురం జిల్లా హిందూపురం నియోజకవర్గం అభివృద్దే తన ప్రధమ లక్ష్యమని ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే, ప్రముఖ నటుడు నందమూరి బాలకృష్ణ స్పష్టం చేశారు. మంగళవారం ఆయన జన్మదినం సందర్బంగా హైదరాబాద్ నగరంలోని బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రిలో జన్మదిన వేడుకలు జరుపుకున్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడారు. సేవా మార్గంలో కొన్ని లక్ష్యాలు పూర్తి చేసేందుకు నిర్ణయించుకున్నానని తెలిపారు. అందుకే చంద్రబాబు కేబినెట్ లో మంత్రి పదవి ఆశించలేదన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో కూడా బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రిని ఏర్పాటు చేయాలని భావిస్తున్నట్లు నందమూరి బాలకృష్ణ వెల్లడించారు. బాలకృష్ణ జన్మదినం సందర్భంగా బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రిలోని రోగులకు పండ్లు పంచిపెట్టారు.