
మంత్రి పదవి ఆశించలేదు: బాలకృష్ణ
అనంతపురం జిల్లా హిందూపురం నియోజకవర్గం అభివృద్దే తన ప్రధమ లక్ష్యమని ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే, ప్రముఖ నటుడు నందమూరి బాలకృష్ణ స్పష్టం చేశారు. మంగళవారం ఆయన జన్మదినం సందర్బంగా హైదరాబాద్ నగరంలోని బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రిలో జన్మదిన వేడుకలు జరుపుకున్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడారు.
సేవా మార్గంలో కొన్ని లక్ష్యాలు పూర్తి చేసేందుకు నిర్ణయించుకున్నానని తెలిపారు. అందుకే చంద్రబాబు కేబినెట్ లో మంత్రి పదవి ఆశించలేదన్నారు. ఆంధ్రప్రదేశ్లో కూడా బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రిని ఏర్పాటు చేయాలని భావిస్తున్నట్లు నందమూరి బాలకృష్ణ వెల్లడించారు. బాలకృష్ణ జన్మదినం సందర్భంగా బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రిలోని రోగులకు పండ్లు పంచిపెట్టారు.