Basavatarakam Cancer Hospital
-
బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రిలో ఓనం వేడుకలు (ఫొటోలు)
-
లీజును రద్దు చేయొచ్చు
సాక్షి, హైదరాబాద్: పేద రోగులకు ఉచితంగా వైద్యం అందిస్తామనే షరతుతో ప్రభుత్వం నుంచి రాయితీ పద్ధతిలో భూమిని లీజుకు తీసుకుని.. షరతులను ఉల్లంఘించిన ప్రైవేటు ఆసుపత్రుల భూమి లీజును రద్దు చేయొచ్చని హైకోర్టు సూచించింది. ఆ భూమిని స్వాధీనం చేసుకోవచ్చని స్పష్టం చేసింది. అపోలో, బసవతారకం కేన్సర్ ఆసుపత్రులు ప్రభుత్వం నుంచి రాయితీ పద్ధతిలో భూమిని లీజుకు తీసుకుని పేదలకు ఉచితంగా వైద్యం చే యాలన్న నిబంధనను ఉల్లం ఘించాయంటూ రిటైర్డ్ ఉద్యోగి ఓఎం దేబరా దాఖలు చేసిన ప్రజాహిత వ్యాజ్యాన్ని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆర్ఎస్ చౌహాన్, జస్టిస్ బి.విజయసేన్రెడ్డిల ధర్మాసనం బుధవారం విచారించింది. ఈ రెండు ఆసుపత్రుల్లో పేదలెవరికీ ఉచితంగా వైద్యం చేయడం లేదని పిటిషనర్ తరఫున న్యాయవాది గండ్ర మోహన్రావు నివేదించారు. పేదలకు ఉచితంగా వైద్యం అందిస్తామనే విషయాన్ని వెబ్సైట్లో కూడా పేర్కొనలేదని వివరించారు. ‘ప్రైవేటు ఆసుపత్రుల తీరు దారుణంగా ఉంది. లక్షల్లో డబ్బు లు కడితేనే శవాలను ఇస్తామంటూ బెదిరింపులకు గురి చేస్తున్నట్లు పత్రికల్లో కథనాలు వస్తున్నాయి. ప్రభుత్వ ఆదేశాలు, నిబంధనలకు విరుద్ధంగా ఫీజులు వసూలు చేస్తున్నారు’అని ఈ సందర్భంగా ధర్మాసనం మండిపడింది. ఈ వ్యవహారంపై కౌంటర్లు దాఖలు చేయాలని ప్రభుత్వంతో పాటు అపోలో, బసవతారకం ఆ సుపత్రుల యాజమాన్యాలను ఆదేశిస్తూ తదుపరి విచారణను 13కు వాయిదా వేసింది. అపోలో 15%, బసవతారకం 25% బెడ్లు ఇస్తామన్నాయి.. ‘జూబ్లీహిల్స్లో అపోలో ఆసుపత్రికి ఎకరాకు రూ.8,500 చొప్పున 30 ఎకరాలను 1985లో ప్రభుత్వం విక్రయిస్తూ జీవో జారీ చేసింది. అయితే 15 శాతం బెడ్లను పేద రోగులకు కేటాయించి వారికి ఉచితంగా వైద్యం చేయాలనే షరతు పెట్టింది. ప్రభుత్వం కేటా యించిన ఈ భూమి విలువ దాదాపు రూ.1,500 కోట్లు. గత 30 ఏళ్లుగా పేదలకు ఇక్కడ వైద్యం అందడం లేదు. ఇటు 1989లో బంజారాహిల్స్లో 7.35 ఎకరాలను నందమూరి బసవతారకం కేన్సర్ ఆసుపత్రికి లీజు పద్ధతిలో ప్రభుత్వం కేటాయించింది. 1,000 బెడ్లతో అక్కడ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిని నిర్మించారు. ఆ భూమి విలువ దాదాపు రూ.400 కోట్లు. ఆస్పత్రిలో 25 శాతం బెడ్లను పేదలకు కేటాయించాలన్న నిబంధన ఉంది. అయినా ఎప్పుడూ పేదలకు ఉచితంగా వైద్యం అందించిన దాఖలాలు లేవు’అని పిటిషనర్ వ్యాజ్యంలో పేర్కొన్నారు. -
చంద్రబాబు సహకారం అందిస్తున్నారు : బాలకృష్ణ
సాక్షి, విజయవాడ : రాష్ట్ర రాజధాని అమరావతిలో బసవతారకం ఆస్పత్రి నిర్మాణానికి 15 ఎకరాలు ఇచ్చిన ఏపీ ప్రభుత్వం, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు సినీహీరో, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ ధన్యవాదాలు తెలిపారు. ఆస్పత్రి అభివృద్ధికి సీఎం తన వంతు సహకారం అందిస్తున్నారని చెప్పారు. ఆదివారం ఆయన విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ.. ఎన్టీఆర్ పురిటి గడ్డమీద బసవతారకం హాస్పిటల్ కార్యకలాపాలు ప్రారంభించడం ఆనందంగా ఉందన్నారు. ఎన్టీఆర్ ఆశయం పురడు పోసుకొని రెండు దశాబ్ధాలుగా కొనసాగడం సంతోషంగా ఉందని చెప్పారు. ఈ ఏడాది ఆగస్టు నెలలో అమరావతిలో బసవతారకం హాస్పిటల్కు భూమి చేయనున్నట్లు బాలకృష్ణ వెల్లడించారు. మూడు ఫేజ్లలో పూర్తి చేస్తామని ప్రకటించారు. తెలంగాణలో బసవతారకం ఆస్పత్రికి పన్ను రద్దు చేసినందుకు రాష్ట్ర ప్రభుత్వంతో పాటు, ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావులకు ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. తన తల్లి బసవతారకం పడిన బాధ ఏతల్లి పడొద్దని అందుకే హాస్పిటల్ ప్రారంభించినట్లు తెలిపారు. జీవితం మన హక్కుని దానిని పోరాడి సాధించుకోవాలన్నారు. ప్రత్యేక హోదా కూడా అంతేన్నారు. -
బసవతారకం కాన్సర్ ఆసుపత్రి వర్షికోత్సవం
-
బసవతారకం ఆస్పత్రిలో నర్సు అనుమానాస్పద మృతి
హైదరాబాద్: ప్రఖ్యాత బసవతారకం ఇండో-అమెరికన్ క్యాన్సర్ ఆస్పత్రిలో నర్సు అనుమానాస్పద మృతి కలకలం రేపింది. బంజారాహిల్స్ రోడ్ నంబర్ 10లో ఉన్న ఈ ఆస్పత్రిలో నర్సుగా పనిస్తోన్న శ్రావణి(21) శుక్రవారం అనుమానాస్పద రీతిలో కన్నుమూసింది. ఆస్పత్రి వర్గాలు అందించిన సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసలు.. శ్రావణి చనిపోయిన ప్రాంతాన్ని క్షుణ్నంగా పరిశీలించి ఆధారాలు సేకరించారు. కేసు నమోదుచేసుకుని మృతదేహాన్ని బసవతారంలోని మార్చుకీకే తరలించారు. ప్రాథమికంగా శ్రావణిది ఆత్మహత్యేనని పోలీసులు భావిస్తున్నారు. కాగా, శ్రావణి తల్లి కూడా ఇదే ఆస్పత్రిలో నర్సుగా పనిచేస్తుండటం గమనార్హం. టీడీపీ ఎమ్మెల్యే, నటుడు నందమూరి బాలకృష్ణ బసవతారకం ఆస్పత్రికి చైర్మన్గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. ఈ కేసుకు సంబంధించిన మరింత సమాచారం తెలియాల్సిఉంది. -
మాపై హత్యాయత్నానికి పాల్పడ్డారు
-
సీఎం కేసీఆర్ను కలిసిన బాలకృష్ణ
హైదరాబాద్: ఇటీవల విడుదలైన తన సినిమా 'డిక్టేటర్' చాలా బాగుందని, ఈ చిత్రాన్ని చూడటానికి రావాలని సీఎం కేసీఆర్ ను ఎమ్మెల్యే, సినీహీరో నందమూరి బాలకృష్ణ ఆహ్వానించారు. ఇది తన 99 వ చిత్రమని, త్వరలో తన కుమారుడు మోక్షజ్ఞను వెండితెరకు పరిచయం చేస్తున్నట్టు ఆయన వెల్లడించారు. ఈ సందర్భంగా బాలకృష్ణ 100 వ సినిమాపై కేసీఆర్ ఆరా తీయగా.. ఆదిత్య 369 కు సీక్వెల్ గా సినిమా చేస్తున్నట్టు చెప్పారు. తాను అప్పట్లో ఎన్టీఆర్, ఏయన్నార్ సినిమాలు ఎక్కువగా చూసేవాడినని కేసీఆర్ గుర్తు చేసుకున్నారు. బాలకృష్ణ సోమవారం ఉదయం క్యాంపు కార్యాలయంలో కేసీఆర్ ను కలిశారు. ఈ సందర్భంగా బసవతారకం ట్రస్టు ఆధ్వర్యంలో క్యాన్సర్ రోగులకు అందుతున్న సేవలను వివరించారు. రోగుల సౌకర్యార్ధం ఆసుపత్రి ఆవరణలో పలు నిర్మాణాలు చేపట్టామని , వాటిని బీఆర్ఎస్ కింద క్రమబద్ధీకరించాలిన బాలకృష్ణ కోరారు. అందుకు కేసీఆర్ సానుకూలంగా స్పందించారు. సేవా దృక్పథంతో రోగులను ఆదుకుంటున్న క్యాన్సర్ ఆసుపత్రి విషయంలో ప్రభుత్వం ఉదారంగా వ్యవహరిస్తుందని సీఎం తెలిపారు. రోగులతో పాటు, వారికి సహాయకులుగా వచ్చే వారికోసం కూడా కనీస సౌకర్యాలు అందించే విషయంలో శ్రద్ధ చూపాలని సూచించారు. సహాయకులు ఉండటానికి షెల్టర్లు, కనీస వసతులు ఏర్పాటు చేయాలన్నారు. నగరంలోని అన్ని ఆసుపత్రుల వద్ద ఇలాంటి సదుపాయాలు ఉండేలా చూస్తామని చెప్పారు. ఈ విషయంపై ఆసుపత్రుల యాజమాన్యాలతో త్వరలోనే సమావేశం నిర్వహిస్తామని కేసీఆర్ వెల్లడించారు. -
మంత్రి పదవి ఆశించలేదు: బాలకృష్ణ
అనంతపురం జిల్లా హిందూపురం నియోజకవర్గం అభివృద్దే తన ప్రధమ లక్ష్యమని ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే, ప్రముఖ నటుడు నందమూరి బాలకృష్ణ స్పష్టం చేశారు. మంగళవారం ఆయన జన్మదినం సందర్బంగా హైదరాబాద్ నగరంలోని బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రిలో జన్మదిన వేడుకలు జరుపుకున్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడారు. సేవా మార్గంలో కొన్ని లక్ష్యాలు పూర్తి చేసేందుకు నిర్ణయించుకున్నానని తెలిపారు. అందుకే చంద్రబాబు కేబినెట్ లో మంత్రి పదవి ఆశించలేదన్నారు. ఆంధ్రప్రదేశ్లో కూడా బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రిని ఏర్పాటు చేయాలని భావిస్తున్నట్లు నందమూరి బాలకృష్ణ వెల్లడించారు. బాలకృష్ణ జన్మదినం సందర్భంగా బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రిలోని రోగులకు పండ్లు పంచిపెట్టారు. -
దుబాయ్లో 'యాన్ ఈవినింగ్ విత్ ద లెజెండ్'