ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వైద్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ను సినీనటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ సోమవారం ఉదయం కలిశారు.
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వైద్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ను సినీనటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ సోమవారం ఉదయం కలిశారు. అనంతరం బాలకృష్ణ మీడియాతో మాట్లాడుతూ.. ఏపీ రాజధానిలో బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రి ఏర్పాటుకు 30 ఎకరాలు కావాలని కోరినట్టు బాలకృష్ణ తెలిపారు.
ఆ విషయంపై ఇప్పటికే సీఎం చంద్రబాబునాయుడుతో మాట్లాడానని బాలయ్య అన్నారు. తనను గెలిపించిన హిందూపురం ప్రజలకు రుణపడి ఉంటానని భరోసా ఇచ్చారు. అదే విధంగా 'పురం'లో ఆస్పత్రిని అభివృద్ధి చేస్తానని బాలకృష్ణ ఈ సందర్భంగా తెలియజేశారు.