
హిందూపురంలో బాలయ్య ప్రజాదర్బార్
హిందూపురం: అనంతపురం జిల్లా హిందూపురంలో స్థానిక శాసనసభ్యుడు, నటుడు నందమూరి బాలకృష్ణ బుధవారం ప్రజాదర్బార్ నిర్వహించారు. ఈ సందర్భంగా నియోజకవర్గ ప్రజల నుంచి వివిధ సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అలాగే వినతి పత్రాలు స్వీకరించారు. వాటిని పరిష్కరిస్తామని ఆయన ప్రజలకు హామీ ఇచ్చారు.
ప్రజల సమస్యలపై బాలకృష్ణ ఉన్నతాధికారులతో చర్చిస్తున్నారు. ఈ ప్రజాదర్బరు కార్యక్రమం రెండు రోజుల పాటు కొనసాగనుంది. అలాగే హిందూపురం మున్సిపాలిటీ పరిధిలో ప్రధాన సమస్యలను పరిష్కరించేందుకు చేపట్టాల్సిన పనులపై ప్రజల సమక్షంలోనే బాలకృష్ణ ఉన్నతాధికారులతో మాట్లాడుతున్నారు.