బాలకృష్ణకు లోక్‌అదాలత్ నోటీసులు | lok adalat issue notice to nandamuri balakrishna | Sakshi

బాలకృష్ణకు లోక్‌అదాలత్ నోటీసులు

Published Sun, Jul 12 2015 10:09 AM | Last Updated on Wed, Aug 29 2018 1:59 PM

బాలకృష్ణకు లోక్‌అదాలత్ నోటీసులు - Sakshi

బాలకృష్ణకు లోక్‌అదాలత్ నోటీసులు

హిందూపురం: అనంతపురం జిల్లా హిందూపురం ఎంఎల్‌ఏ, సినీ నటుడు బాలకృష్ణ, మున్సిపల్ చైర్‌పర్సన్ ఆర్.లక్ష్మి, మున్సిపల్ కమిషనర్ వీరభద్రరావుకు శనివారం లోక్‌అదాలత్ కోర్టు న్యాయమూర్తి ఏడీజే రాములు నోటీసులు జారీ చేశారు. ఈ నోటీసులో ఆగస్టు 1న లోక్‌అదాలత్‌కు హాజరుకావాలని ఆదేశించారు.

హిందూపురం పట్టణంలోని బైపాస్ రోడ్డు నుంచి వన్‌టౌన్ పోలీసుస్టేషన్, ఫైర్‌స్టేషన్ మీదుగా పెనుకొండ రోడ్డుకు కలుపుతూ 1993లో 80 అడుగుల రోడ్డుగా విస్తరిస్తూ మాస్టర్ ప్లాన్ రూపొందించారు. ఈ రహదారిని ఏర్పాటు చేయడానికి పట్టణంలోని గురునాథ్ టాకీస్ నిర్వాహకులు పొలాలను కూడా మున్సిపాలిటికి ఉచితంగా అందించారు.

అయితే నేటికి విస్తరణ చేపట్టలేదని పట్టణానికి చెందిన వెంకటరాముడు అనే వ్యక్తి లోక్‌అదాలత్‌ను ఆశ్రయించారు. ప్రజాప్రతినిధులు, మున్సిపల్ అధికారులు రోడ్డు విస్తరణలో చొరవ చూపకపోవడంతో ప్రజలకు తీవ్ర ఇబ్బంది కలుగుతోందని న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లారు. స్పందించిన న్యాయమూర్తి ప్రతివాదులైన ఎంఎల్‌ఏ బాలకృష్ణ, చైర్‌పర్సన్, మున్సిపల్ కమిషనర్‌కు నోటీసులు జారీ చేశారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement