నిరాహార దీక్ష చేస్తున్న లెమల్లెపాడు గ్రామస్తులు
లెమల్లెపాడు(వట్టిచెరుకూరు): రెండు నెలలుగా గ్రామంలో నెలకొన్న తాగునీటి సమస్యకు తక్షణమే పరిష్కారం చూపాలని కోరుతూ లెమల్లెపాడు గ్రామస్థులు గ్రామంలోని పోలేరమ్మ తల్లి గుడి సెంటర్ వద్ద రిలే నిరాహార దీక్షల్ని బుధవారం నుంచి చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గుంటూరు చానల్ ద్వారా నీటిని విడుదల చేసి చెరువులు నింపుకొనే అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు. వారం రోజుల నుంచి చందాలు వేసుకుని ట్యాంకర్ల ద్వారా నీటిని తెచ్చుకుంటున్నామని, తాగునీటి సమస్యను పరిష్కరించకపోతే తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తుందని వాపోయారు.
అధికారులు అలసత్వ వైఖరి నిరసనగా గత్యంతరం లేక నిరాహార దీక్ష చేపట్టినట్లు తెలిపారు. విషయం తెలుసుకున్న ఎంపీడీవో సుధాకర్, తహసీల్దార్ రాములునాయక్, ఎస్‌ఐ అశోక్ దీక్ష స్థలానికి వచ్చి దీక్షలో పాల్గొన్న గ్రామస్థులతో మాట్లాడారు. జిల్లా ఉన్నతాధికారుల దృష్టికి సమస్యలను తీసుకెళ్లి పరిష్కరిస్తామని హామీ ఇచ్చినా గ్రామస్థులు పట్టువీడలేదు. శాంతిభద్రతల్ని దృష్టిలో ఉంచుకుని రిలే నిరాహార దీక్ష శిబిరం వద్ద పోలీసులు బందోబస్తు నిర్వహించారు.
Comments
Please login to add a commentAdd a comment