ఆదిలాబాద్ జిల్లా ఖానాపూర్ మండలంలో ప్రజలు తాగు నీటికోసం నిరసన చేపట్టారు.
ఖానాపూర్ : ఆదిలాబాద్ జిల్లా ఖానాపూర్ మండలంలో ప్రజలు తాగు నీటికోసం నిరసన చేపట్టారు. బాదనకుర్తిలో కొన్ని రోజులుగా నీటి సమస్య తీవ్రమైంది. అధికారులు, ప్రజాప్రతినిధులకు విన్నవించినా పట్టించుకోవటం లేదంటూ శుక్రవారం ఉదయం ప్రధాన రహదారిపైకి చేరి గ్రామస్తులు నిరసన చేశారు. ఖాళీ బిందెలతో రాస్తారోకో ప్రారంభించారు. దీంతో ప్రధాన రహదారిపై కొద్దిసేపు రాకపోకలు స్తంభించాయి. పోలీసులు అక్కడికి చేరుకుని గ్రామస్తులను ఇళ్లకు పంపించివేశారు.