మెదక్: తాగునీటి కోసం మహిళలు ఖాళీ బిందెలతో మెదక్ - నర్సాపూర్ ప్రధాన రహదారిపై గంటపాటు రాస్తారోకో చేశారు. ఈ సంఘటన మెదక్ మండలం మంబోజిపల్లి చౌరస్తాలో శుక్రవారం చోటు చేసుకుంది. బాధితుల కథనం మేరకు మంబోజిపల్లి గ్రామంలోని ఇంద్రనగర్ కాలనీలో వంద నివాస గృహాలున్నాయి. ఇప్పటిదాకా వారికి బోరుబావి నీటిని డైరైక్టు పంపింగ్ ద్వారా అందిస్తున్నారు.
బావిలో ఊట తగ్గి పోవటంతో నెల రోజులుగా కాలనీ వాసులు నీటి కోసం అల్లాడుతున్నారు. ప్రజాప్రతినిధులకు చెప్పినా ఫలితం లేకపోవటంతో మహిళలు శుక్రవారం మెదక్ - నర్సాపూర్ ప్రధాన రహదారిపై బైఠాయించారు. దీంతో వాహనాలు పెద్ద సంఖ్యలో నిలిచిపోయాయి. మెదక్ రూరల్ ఎస్సై వినాయక్‌రెడ్డి జోక్యంతో రాస్తారోకో విరమించారు.
నీటి కోసం ఆందోళన
Published Fri, Jun 12 2015 6:42 PM | Last Updated on Sun, Sep 3 2017 3:38 AM
Advertisement