
పరిశ్రమల శాఖ పనితీరుపై టీడీపీ ఎమ్మెల్యే ఫైర్
గుంటూరు: పరిశ్రమల శాఖ పనితీరుపై తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే శ్రవణ్ కుమార్ అసహనం వ్యక్తం చేశారు. పారిశ్రామిక ప్రగతి నివేదిక ఇచ్చి మూడేళ్లైనా అధికారులు పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇలాంటి పనితీరు మూలంగా పరిశ్రమలన్నీ ఇతర రాష్ట్రాలకు వెళ్తున్నాయని శ్రవణ్ కుమార్ మండిపడ్డారు. బ్యాంకులు సైతం ఎగ్గొట్టేవారికే రుణాలిస్తున్నాయన్నారు. పరిశ్రమల శాఖ, బ్యాంకుల పనితీరు మారాలని శ్రవణ్ కుమార్ సూచించారు.