రాయపూడిలో రాజధాని భూముల రభస! | farmers-peasant-revolt-in-rayapudi-over-capital-land-issue | Sakshi
Sakshi News home page

Published Sun, Nov 16 2014 3:50 PM | Last Updated on Thu, Mar 21 2024 9:01 PM

తుళ్లూరు మండలం రాయపూడిలో రాజధాని భూముల సేకరణపై జరుగుతున్న అభిప్రాయ సేకరణ సమావేశంలో ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. అభిప్రాయ సేకరణలో తమను ఎందుకు మాట్లాడనివ్వరని కొందరు రైతులు తాడికొండ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్ను ప్రశ్నించారు. ఈ సందర్భంగా శ్రావణ్ కుమార్ అనుచరులు రైతులకు అడ్డు తగిలారు. వారితో వాగ్వాదానికి దిగారు. ప్రశ్నించిన రైతులపై ఎమ్మెల్యే అనుచరులు దౌర్జన్యం చేశారు. రైతులు తమ సమస్యలు చెప్పకుండా, వారి కోరికలు తెలియజేయకుండా అడ్డుపడ్డారు. ఆ దృశ్యాలను చిత్రీకరిస్తున్న మీడియా ప్రతినిధులను కూడా వారు దుర్భాషలాడారు.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement