
రకుల్ ప్రీత్‌సింగ్
ఓటీటీలకు రోజురోజుకూ ఆదరణ పెరుగుతుండటంతో సినిమా ఇండస్ట్రీ దృష్టి ఇప్పుడు వాటిపై పడింది. అందుకే స్టార్ హీరోలు, హీరోయిన్లు, ప్రముఖ దర్శకులు, పేరున్న నిర్మాణ సంస్థలు సైతం డిజిటల్ వేదికవైపు అడుగులేస్తున్నారు. సమంత, తమన్నా, కాజల్ అగర్వాల్ వంటి స్టార్ హీరోయిన్లు ఇప్పటికే వెబ్ సిరీస్‌లకు సై అన్నారు. ఈ జాబితాలోకి తాజాగా హీరోయిన్ రకుల్ ప్రీత్‌సింగ్ చేరనున్నారని సమాచారం.
ఆమె ఓ వెబ్ సీరీస్‌లో నటించేందుకు పచ్చజెండా ఊపారని టాక్. ఇందులో రకుల్ ద్విపాత్రాభినయం చేయనున్నారట. అది కూడా కవలలుగా నటించనున్నారని తెలిసింది. ప్రతి విషయంలోనూ ఈ కవలలు నువ్వా? నేనా? అన్నట్టు ఒకరితో ఒకరు పోటీ పడుతుంటారని, ఆ సన్నివేశాలు చాలా ఆసక్తికరంగా సాగుతాయని టాక్. ఇప్పటివరకూ ఏ సినిమాలోనూ రకుల్ డబుల్ రోల్ చేయలేదు. సో.. ఆమె రెండు పాత్రల్లో కనిపిస్తే అభిమానులకు పండగలా ఉంటుంది.
Comments
Please login to add a commentAdd a comment